Tamilisai: నేను ఎవర్నీ తప్పుపట్టేందుకు ఉస్మానియా ఆస్పత్రికి రాలేదు
Tamilisai: కొత్త ఆస్పత్రి భవనం కట్టాల్సిన అవసరం ఉంది
Tamilisai: నేను ఎవర్నీ తప్పుపట్టేందుకు ఉస్మానియా ఆస్పత్రికి రాలేదు
Tamilisai: తాను ఎవరిని తప్పు పట్టేందుకు ఉస్మానియా ఆసుపత్రికి రాలేదని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. గవర్నర్ ఉస్మానియా ఆసుపత్రిని సోమవారం పరిశీలించారు. పాత భవనాన్ని పరిశీలించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో టాయిలెట్ల పరిస్థితి దారుణంగా ఉందని తమిళిసై అన్నారు. ఆసుపత్రి పైకప్పు పెచ్చులూడి రోగులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు.
ఉస్మానియా ఆసుపత్రి భవనం కట్టి వందేళ్లు అవుతుందని... కొత్త భవనం కట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఇటీవల ఉస్మానియా ఆసుపత్రి నూతన భవనం నిర్మాణం చేపట్టాలని కోరుతూ తమిళిసై ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.