Telangana: త్వరలో మారనున్న ప్రభుత్వాస్పత్రుల రూపురేఖలు

Telangana: గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లో ఆధునిక సౌకర్యాలు

Update: 2022-05-11 06:23 GMT

 Telangana: త్వరలో మారనున్న ప్రభుత్వాస్పత్రుల రూపురేఖలు

Telangana: ప్రభుత్వ ఆస్పత్రి అనగానే జనాలు భయపడుతుంటారు. ప్రభుత్వాస్పత్రికి వెళ్లాలంటే జంకుతారు. సర్వీసులు సరిగా ఉండవని డాక్టర్లు అందుబాటులో ఉండరని డాక్టర్ ఉంటే నర్సులు ఉండరు. ఇద్దరు ఉంటే సౌకర్యాలు ఉండవు. ఇలా ప్రతిదీ సమస్యగానే కనిపిస్తుంది. అయితే ఇదంతా గతం తెలంగాణలో ఇప్పుడు ప్రభుత్వాస్పత్రుల రూపు రేఖలే మారిపోనున్నాయి. ఈ నెల 12 న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలను అందుబాటులోకి తీసుకురానున్నారు.

తెలంగాణలో అతిపెద్ద ఆస్పత్రుల్లో ఒకటి అయిన గాంధీ ఆస్పత్రిలో ఆధునిక పరికరాలు అందుబాటులోకి రానున్నాయి. గాంధీ ఆస్పత్రికి క్యాతల్యాబ్, MRI స్కానింగ్ పరికరాలు కొత్తవి అందుబాటులోకి రానున్నట్లు గాంధీ సూపరింటెండెంట్ రాజారావు అన్నారు. వీటితో పాటు అవయవ మార్పిడి విధానం అందుబాటులోకి రావడంతో ఎంతోమంది మందికి ఉచితంగా ట్రాన్స్‌ప్లాంటేషన్ చేశామని ఇంకా కొంత మంది క్యూలో ఉన్నారని అన్నారు. మొన్నటి వరకు క్యాతల్యాబ్, స్కానింగ్ కోసం ఉస్మానియాకు పంపించే వాళ్లమని ఇకపై ఆ అవసరం ఉండబోదన్నారు. కాంట్రాక్ట్ విధానంలో మార్పుల కారణంగా చాలా మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు. భోజనానికి గతంలో 40 రూపాయలు ఉంటే ఇప్పుడు 80 రూపాయలకు పెంచినట్లు తెలిపారు.

వందేళ్ల చరిత్ర ఉన్న ఉస్మానియా ఆస్పత్రికి ఇప్పుడు కొత్తగా మెడికల్ షాపుల పెరుగుదల, ప్రత్యేక ఆపరేషన్ల కోసం గదులు, పరీక్షల కోసం ఆధునిక పరికరాలు అందుబాటులోకి రానున్నాయని సూపరింటెండెంట్ నాగేంద్ర అన్నారు. సిసి కెమెరాలు, 5రూపాయల భోజనం వంటికి కూడా అందుబాటులోకి రానున్నాయన్నారు. రోగులతోపాటు వచ్చే అటెండెంట్‌లకు కూడా భోజన సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు. చాలా కాలంగా అవయవమార్పిడి చేస్తున్నామన్నారు.

వైద్యం కోసం ప్రభుత్వాస్పత్రికి వెళ్లాలంటే ఒకప్పుడు ఎవరైనా భయపడేవారు. ఆ పరిస్థితి నుంచి బయటపడాలంటే కార్పొరేట్‌ స్థాయి సౌకర్యాలు ప్రభుత్వాస్పత్రుల్లో ఏర్పాటు చేస్తే పేదలకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News