డ్రగ్స్ నివారణపై ప్రభుత్వం ఫోకస్

Drugs: హైదరాబాద్‌లో రెండు ప్రత్యేక విభాగాల ఏర్పాటు.... హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం.

Update: 2022-02-09 02:58 GMT

డ్రగ్స్ నివారణపై ప్రభుత్వం ఫోకస్ 

Drugs: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ డ్రగ్స్ సమూల నిర్మూలనకు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. డ్రగ్స్ సరఫరా, వినియోగం నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో మత్తు పదార్థాల నిర్మూలన కోసం రెండు ప్రత్యేక విభాగాలు ఏర్పాటయ్యాయి.

హైదరాబాద్ సీపీ కార్యాలయం కేంద్రంగా ఈ రెండు విభాగాలు బుధవారం నుంచి పటిష్ట చర్యలు చేపట్టనున్నాయి. హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం, నార్కోటిక్స్ ఇన్వెస్టిగేషన్ సూపర్ విజన్ వింగ్ పేరిట వీటిని ఏర్పాటు చేశారు. నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్ మెంట్ విభాగంలో డీసీపీ స్థాయి అధికారి పర్యవేక్షణలో ఇద్దరు ఇన్ స్పెక్టర్లు, నలుగురు ఎస్ఐలు, 20 మంది కానిస్టేబుళ్లు పనిచేస్తారు. నార్కోటిక్స్ ఇన్వెస్టిగేషన్ సూపర్ విజన్ వింగ్‌లో ఒక ఏసీపీ, ఇన్‌స్పెక్టర్, ఒక ఎస్ఐ, ఆరుగురు కానిస్టేబుళ్లు విధులు నిర్వర్తిస్తారు. బుధవారం ఈ రెండు విభాగాలను రాష్ట్ర డీజీపీ ప్రారంభించనున్నారు.

Tags:    

Similar News