కాజీపేట జంక్షన్ లో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
కాజీపేట రైల్వే జంక్షన్ పరిధిలో శనివారం రాత్రి గూడ్స్ రైలు పట్టాలు తప్పిన సంఘటన చోటు చేసుకుంది.
వరంగల్: కాజీపేట రైల్వే జంక్షన్ పరిధిలో శనివారం రాత్రి గూడ్స్ రైలు పట్టాలు తప్పిన సంఘటన చోటు చేసుకుంది. రైల్వే అధికారులు తెలిపిన వివరాల మేరకు రైల్వే జంక్షన్ పరిధిలోని యార్డులో గూడ్స్ రైలు షేంటింగ్ అవుతుండగా అదుపుతప్పి మూడు బోగీలు పట్టాలు తప్పాయి.
వెంటనే సైరన్ రావడంతో సమాచారం అందుకున్న రైల్వే అధికారులు ఎమర్జెన్సీ స్టాఫ్ తరలివెళ్లి పట్టాలు తప్పిన భోగిలను యధావిధిగా పట్టాల పైకి తీసుకురావడానికి రైల్వే అధికారులు పనులు చేపట్టారు. ఈ సంఘటన వలన రైల్వేకు ఎలాంటి ఆస్తి నష్టం జరగలేదని అలాగే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదన్నారు. రైళ్ళ రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేదని వెల్లడించారు. భోగీలు పట్టాలు తప్పడానికి గల కారణాలను క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుందన్నారు.