Golkonda Fort Reopening: గోల్కొండ సందర్శనకు అనుమతి ఎప్పటినుంచి అంటే..

Golkonda Fort Reopening: కరోనా మహమ్మారి కారణంగా బాగా దెబ్బతిన్న రంగాల్లో టూరిజం ప్రధానమైనదిగా చెప్పవచ్చు.

Update: 2020-07-04 04:00 GMT

Golkonda Fort Reopening: కరోనా మహమ్మారి కారణంగా బాగా దెబ్బతిన్న రంగాల్లో టూరిజం ప్రధానమైనదిగా చెప్పవచ్చు. లాక్ డౌన్ తో రవాణా సదుపాయాలు నిలిచిపోవడం.. ప్రజలు ఇదివరకటిలా బృందాలుగా తిరిగే అవకాశం లేకపోవడం..దాదాపుగా అన్ని ప్రధాన టూరిజం ప్రదేశాలనూ మూసివేసి ఉంచడంతో ఆయా టూరిజం ప్రాంతాలన్నీ వేల వేల బోతున్నాయి. హైదరాబాద్ లో కూడా ఇదే విధంగా అన్నిపర్యాటక ప్రదేశాలు మూతపడ్డాయి. ఇప్పుడు లాక్ డౌన్ పేరుతో నిలిపివేసిన కార్యాకలాపాలన్నీ అన్ లాక్ విధానంతో ఒక్కొటిగా తిరిగి ప్రారంభమవుతున్నాయి.

దీనిలో భాగంగానే తెలంగాణాకు తలమానికంగా ఉన్న గోల్కొండ సందర్శనకు అనుమతి ఇచ్చేందుకు అధికారులు నిర్ణయించారు. అయితే వీటి సందర్శనలో భాగంగా సందర్శకులు భౌతిక దూరం పాటించడమే కాకుండా మాస్క్ లు విధిగా ధరించాలని కోరారు.

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. భారత్ లో రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో భాగ్యనగరంలోని చారిత్రక గోల్కొండ కోటలో సోమవారం నుంచి సందర్శకులను అనుమతించనున్నారు. ఈ మేరకు పురావస్తు శాఖ అధికారులు శుక్రవారం అంతర్గత సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకున్నారు. ప్రతిరోజూ కేవలం 2000 మందికి మాత్రమే అనుమతి ఉంటుందని గోల్కొండ కోట పర్యవేక్షణాధికారి నవీన్‌ తెలిపారు.

కొవిడ్‌ -19 నిబంధనలు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలన్నారు. అదే విధంగా తినుబండారాలను అనుమతించబోమని, క్యాంటీన్‌లో మంచినీరు మాత్రమే అమ్ముతామన్నారు. ఉదయం 8.30 నుంచి సాయంత్రం 5.30 వరకు కోటను తెరిచి ఉంచుతామని, సందర్శకులు ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్‌ చేసుకోవాలని సూచించారు.

Tags:    

Similar News