కాంగ్రెస్‌ జీహెచ్‌ఎంసీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల

Update: 2020-11-24 09:17 GMT

Congress Released a Manifesto : కాంగ్రెస్‌ జీహెచ్‌ఎంసీ ఎన్నికల మేనిఫెస్టోను పార్టీ ఇంఛార్జ్ మాణికం ఠాగూర్ విడుదల చేశారు. గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో .. కాంగ్రెస్‌ వ్యవహారాల రాష్ట్ర ఇన్‌ఛార్జి ఠాగూర్‌, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, గీతారెడ్డి, షబ్బీర్‌ అలీ తదితరులు మేనిఫెస్టోను విడుదల చేశారు. గ్రేటర్‌ ప్రజల ఓట్లను ఆకర్షించే విధంగా మేనిఫెస్టోను రూపొందించారు.

వరద బాధితులకు 50వేల చొప్పున ఆర్థికసాయం, పూర్తిగా దెబ్బతిన్న గృహాలకు 5లక్షల సాయం అందిస్తామని మేనిఫెస్టోలో ప్రకటించారు. వరదల్లో చనిపోయిన కుటుంబాలకు 25 లక్షల పరిహారం చెల్లిస్తామన్నారు. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేరుస్తామని ప్రకటించారు. మెట్రో, ఎంఎంటీఎస్‌ సేవలు పాతబస్తీ, శంషాబాద్‌ వరకు విస్తరింపుతో పాటు మెట్రో, ఎంఎంటీఎస్‌లో ప్రయాణించే మహిళలు, వృద్ధులకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అర్హత కలిగిన అందరికీ డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు, 100 యూనిట్ల లోపు గృహాలకు ఉచిత కరెంట్, 80 గజాలలోపు ఉన్న ఇళ్లకు ట్యాక్స్‌ను రద్దు చేస్తామని మేనిఫెస్టోలో తెలిపారు కాంగ్రెస్‌ నేతలు.

Tags:    

Similar News