Gas Leak: కొంపల్లి సూచిత్రలో గ్యాస్ పైప్‌లైన్ లీక్..
Gas Leak: తరచు ఘటనలు జరుగుతుండటంతో భయాందోళనలో స్ధానికులు
Gas Leak: కొంపల్లి సూచిత్రలో గ్యాస్ పైప్‌లైన్ లీక్.. భారీగా ఎగసిపడుతున్న మంటలు
Gas Leak: భాగ్యనగర్ గ్యాస్ నిర్లక్ష్యంతో ఇద్దరి నిండు ప్రాణాలు విషమంగా మారాయి. కొంపల్లి సూచిత్ర ప్రధాన రోడ్డుపై గ్యాస్ పైప్ లీకేజీ ఘటనలో మంటలు ఎగిసిపడ్డాయి. పక్కనే ఉన్న సాయినాథ్, రాజా అనే ఇద్దరికి మంటలు అంటుకున్నాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారిని హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. గ్యాస్ లీకేజీ అయ్యి గంట సేపు దాటుతున్న భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ వాళ్ళు ఎవ్వరు పట్టించుకోలేదని.. తరుచు ఇలాంటి ఘటనలు జరుగుతుండడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.