మహా సంబురానికి వేదిక కానున్న మహానగరం

Hyderabad: వచ్చే నెలలో గణపతి నవరాత్రి ఉత్సవాలు

Update: 2022-07-20 01:45 GMT

మహా సంబురానికి వేదిక కానున్న మహానగరం

Hyderabad: పండుగ ఏదైనా మహానగరం మహా వైభంగా జరుపుకుంటుంది. బోనం ఎత్తినా, శోభాయాత్ర చేసినా కనువిందు చేస్తుంది. అదే గణేషుడి పండగ వస్తే ప్రతి గల్లీ సంబరాల వేదికగా మారుతుంది. అయితే ఈసారి హైదరాబాద్‌ గణేష్ ఉత్సవాలకు అనేక అవరోధాలు అడ్డొస్తున్నాయి. నిబంధనలు అడ్డంగా నిలుస్తున్నాయి.

వినాయక చవితి రాగానే హైదరాబాద్ లోని ప్రతి గల్లీ ఓ కుటుంబమైపోతుంది. అందరు ఏకమై వీధుల్లో గణేషుడిని ప్రతిష్టించి పూజలు చేస్తారు. పోటీపడి మరీ విగ్రహాల ఎత్తు ఉండేలా చూసుకుంటారు. కానీ ఈసారి అలా కాకుండా మహానగరమంతా మట్టి విగ్రహాలే దర్శనమివ్వనున్నాయి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్ తో తయారు చేసిన విగ్రహాలను చెరువుల్లో నిమజ్జనం చేయడం వల్ల కాలుష్యానికి కారణమవుతున్నాయి. మట్టి విగ్రహాలను పూజించాలని పర్యావరణవేత్తలు, ప్రకృతి ప్రేమికులు ఎన్నో ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. చివరికి ఈ ఏడాది ఖచ్చితంగా మట్టివిగ్రహాలను ప్రతిష్టించేలా చర్యలు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. దీంతో విగ్రహ తయారీదారులు సైతం ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్ విగ్రహాలను కాకుండా మట్టి విగ్రహాలను సిద్ధం చేస్తున్నారు.

మట్టి విగ్రహాల తయారీలో రాజస్తాన్, గుజరాత్, నుంచి తీసుకువచ్చిన ప్రత్యేకమైన పౌడర్‌లా ఉండే మట్టిని వినిమోగిస్తున్నామని తయారీదారులు చెబుతున్నారు. 50 రూపాయలు విలువజేసే మట్టి విగ్రహాల నుంచి 5 లక్షలు విలువజేసే విగ్రహాల వరకు హైదరాబాద్‌లో రెడీ అవుతున్నాయని తయారీ దారులు చెబుతున్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్ విగ్రహాలతో పోలిస్తే మట్టి విగ్రహాలకు కాస్త ధరలు ఎక్కువగా ఉంటాయి. మరోవైపు వినాయక మండప నిర్వాహకుల్లోనూ చైతన్యం కనిపిస్తోంది. భారీ విగ్రహం కంటే మట్టి విగ్రహమే మేలు అనే ఆలోచనకు వచ్చారు.

Tags:    

Similar News