Hyderabad: హైదరాబాద్ పాతబస్తీలో అర్ధరాత్రి గ్యాంగ్‌వార్..
Hyderabad: మాట మాట పెరిగి ఒకరిపై మరొకరు దాడి చేసుకున్న వైనం
Hyderabad: హైదరాబాద్ పాతబస్తీలో అర్ధరాత్రి గ్యాంగ్‌వార్..
Hyderabad: హైదరాబాద్ పాతబస్తీలో అర్ధరాత్రి గ్యాంగ్‌వార్ చోటుచేసుకుంది. రెండు గ్రూపులకు చెందిన యువకుల మధ్య గొడవ జరిగింది. ఓ కేసు సెటిల్‌మెంట్ కోసం అర్ధరాత్రి ఓ హోటల్‌లో సమావేశం అయ్యాయి రెండు గ్రూపులు. అయితే.. సెటిల్‌మెంట్ సమయంలో మాట మాట పెరిగి ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో పలువురికి గాయాలు కాగా.. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. బహదూర్‌పురా పీఎస్ పరిధిలో ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.