Telangana: హైదరాబాద్‌లో 4 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు

Telangana: ఇప్పటికే ఉన్న టిమ్స్ తో పాటు హైదరాబాద్ లోనే మరో 3సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను నిర్మించాలని టీెఎస్ కేబినెట్ నిర్ణయించింది.

Update: 2021-06-20 04:42 GMT

Telangana CM KCR

Telangana: ఎట్టకేలకు తెలంగాణ ప్రభుత్వం ఓ అడుగు ముందుకేసింది. ఎప్పుడో కేసీఆర్ చెప్పిన మాట ఇన్నాళ్లకు ఆచరణలోకి వచ్చింది. ఉస్మానియా ఆస్పత్రిని పడేసి కొత్తది కడతామని.. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను మరో మూడు రెడీ చేస్తామన్న ముఖ్యమంత్రి మాటలు.. ఉస్మానియా ఆస్పత్రి కూల్చివేత ఆగిపోవడంతోనే ఆగిపోయాయి. కరోనా నేపథ్యంలో ఇప్పుడు మళ్లీ ఆ ఆలోచనలు ఆచరణలోకి వస్తున్నాయి. ఇప్పటికే ఉన్న టిమ్స్ ను సూపర్ స్పెషాలిటీగా మార్చడంతో పాటు.. హైదరాబాద్ లోనే మరో మూడు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను నిర్మించాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది.

హైదరాబాద్‌లోని కొత్తపేట కూరగాయల మార్కెట్‌ను ఆధునీకరించాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న కూరగాయల మార్కెట్‌ను పూర్తిగా ఆధునీకరించి ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్‌గా మార్చాలని మంత్రివర్గం నిర్ణయించింది. అంతేకాదు జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇప్పుడున్న టిమ్స్ దవాఖానను ప్రజా అవసరాలకు అనుగుణంగా మార్పు చేసి, దాన్ని సూపర్ స్పెషాలిటీ దవాఖానగా అధునీకరిస్తామని తెలిపింది. దానికి తోడుగా ఇంకా 3 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్మించాలని.. మొత్తం 4 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను కేబినెట్ మంజూరు చేసింది.

వీటిలో చెస్ట్ హాస్పిటల్ ప్రాంగణంలో ఒకటి, ఈ మధ్యనే గడ్డి అన్నారం నుంచి షిప్టు చేసిన ప్రూట్ మార్కెట్ ప్రాంగణంలో రెండవది, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో అల్వాల్ నుంచి ఓఆర్ఎర్ మధ్యలో మూడవది.. టిమ్స్‌ ను కలిపి మొత్తం నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను నిర్మించాలని కేబినెట్ నిర్ణయించింది.

Tags:    

Similar News