Balka Suman: యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా డిప్యూటీ సీఎంకు అవమానం
Balka Suman: రెడ్డి నాయకుల దగ్గర ఎస్సీ బిడ్డను కింద కూర్చోబెట్టారు
Balka Suman: యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా డిప్యూటీ సీఎంకు అవమానం
Balka Suman: యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా డిప్యూటి సీఎం భట్టి విక్రమార్కకు అవమానం జరిగిందన్నారు బీఆర్ఎస్ నేత బాల్కసుమన్. రెడ్డి నాయకుల దగ్గర ఒక ఎస్సీ బిడ్డను క్రింద కూర్చోబెట్టారని.. రేవంత్‌రెడ్డి సతీమణినీ పైన కూర్చోబెట్టి బీసీ బిడ్డ అయిన కొండా సురేఖను కింద కూర్చోబెట్టారన్నారు. దేవుడి దగ్గరే ఇంత అవమానం జరిగితే ఎవరికి చెప్పుకోవాలని ప్రశ్నించారు. కాంగ్రెస్‌లో సీనియర్ నాయకుడైనా భట్టి విక్రమార్కను అవమానించారన్నారు. 75 ఏళ్ల స్వాతంత్ర్య భారతంలో దళితులకు కాంగ్రెస్ పార్టీలో అవమానం జరుగుతూనే ఉందన్నారు.