Zahirabad: ఆయన మాకొద్దు..కేంద్రమంత్రి, బీజేపీ చీఫ్‌ కిషన్‌రెడ్డికి నిరసన సెగ

Zahirabad: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్‌రెడ్డిని అడ్డుకున్న జైపాల్‌రెడ్డి అనుచరులు

Update: 2024-03-02 11:14 GMT

Zahirabad: ఆయన మాకొద్దు..కేంద్రమంత్రి, బీజేపీ చీఫ్‌ కిషన్‌రెడ్డికి నిరసన సెగ

Zahirabad: కేంద్రమంత్రి, బీజేపీ చీఫ్‌ కిషన్‌రెడ్డికి నిరసన సెగ తగిలింది. నిన్న ఢిల్లీలో తరుణ్‌చుగ్‌ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు బీబీ పాటిల్. అయితే.. బీబీ పాటిల్‌ బీజేపీలో చేరికను జహీరాబాద్‌ బీజేపీ కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బీబీ పాటిల్‌కు టికెట్‌ ఇవ్వొద్దంటూ నినాదాలు చేశారు. బీజేపీ నుంచి జహీరాబాద్‌ ఎంపీ టికెట్‌ను మాజీమంత్రి బాగారెడ్డి కుమారుడు జైపాల్‌రెడ్డి ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్‌రెడ్డిని జైపాల్‌రెడ్డి అనుచరులు అడ్డుకున్నారు. అభివృద్ధి చేయని పార్లమెంట్‌ సభ్యుడు బీబీ పాటిల్‌ తమకొద్దంటూ నినాదాలు చేశారు. దీంతో కాస్త ఉద్రిక్తత చోటుచేసుకుంది.

Tags:    

Similar News