Fire Accident: కొండాపూర్‌లో భారీ అగ్ని ప్రమాదం..కాలిబూడిదైన కొత్త కార్లు..!

Fire Accident: హైదరాబాద్‌ కొండాపూర్‌‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఏఎంబీ మాల్ సమీపంలో గల మహీంద్ర కార్ల షోరూంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు ఎగిసిపడ్డాయి.

Update: 2025-01-24 06:11 GMT

Fire Accident: కొండాపూర్‌లో భారీ అగ్ని ప్రమాదం..కాలిబూడిదైన కొత్త కార్లు..!

Fire Accident: హైదరాబాద్‌ కొండాపూర్‌‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఏఎంబీ మాల్ సమీపంలో గల మహీంద్ర కార్ల షోరూంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు ఎగిసిపడ్డాయి. గురువారం రాత్రి షోరూం మూసివేసిన కొద్దిసేపటికే అంటే సుమారు 11 గంట ప్రాంతంలో షోం రూంలో పొగలు రావడాన్ని సెక్యూరిటీ సిబ్బంది గమనించారు. వెంటనే ఆ విషయాన్ని నిర్వాహకులకు, ఫైర్ సిబ్బందికి తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది.. రెండు గంటల పాటు శ్రమించి మంటల్ని అదుపు చేశారు.

ఫైర్ సిబ్బంది వచ్చే లోపే మంటలు వ్యాపించాయి. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగతో నిండిపోయింది. పొగ వల్ల చుట్టుపక్కల ప్రజలు ఊపిరాడక ఇబ్బంది పడ్డారు. మంటలు ఎక్కువగా వ్యాపించడంతో పక్కనే ఉన్న దుకాణదారులు ఆందోళకు గురయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో షోరూంలో దాదాపు 30కి పైగా కార్లు ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో చాలా వరకు కాలిపోయాయి. సర్వీసింగ్ కోసం మూడు కార్లు తీసుకురాగా అవి కూడా అగ్నికి ఆహుతైనట్టు సిబ్బంది తెలిపారు. షోరూంలో పెద్ద ఎత్తున థర్మాకోల్, ఫ్యాబ్రిక్ వస్తువులు, పాస్లిక్ సామాగ్రి ఉండడంతో మంటలు త్వరగా వ్యాపించాయని ఫైర్ సిబ్బంది అంటున్నారు.

షోరూంకు పక్కనే ఉన్న ఓయో రూంకు కూడా మంటలు వ్యాపించే ప్రమాదం ఉండడంతో ముందు జాగ్రత్తగా ఖాళీ చేయించామని అన్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదంలో దాదాపు 30 కార్లు కాలిపోవడంతో భారీగా ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అంటున్నారు. షోరూం నిర్వాహకుల పూర్తి సమాచారం తర్వాత దీనిపై ఓ క్లారిటీ వస్తుందని పోలీసులు తెలిపారు.


Tags:    

Similar News