Dussehra Celebrations: రెండు తెలుగు రాష్ట్రాలలో వైభవంగ విజయదశమి వెేడుకలు

Dussehra Celebrations: దసర సందర్బంగా రెండు తెలుగు రాష్ట్రాలలో పలు ఆలయల్లో ప్రత్యెక పూజలు

Update: 2021-10-15 09:59 GMT

రెండు తెలుగు రాష్ట్రల్లో దసరా వేడుకలు (ఫైల్ ఇమేజ్)

హైదరాబాద్‌లో దసరా సంబరాలు:

హైదరాబాద్‌లో దసరా సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. పండుగ సందర్భంగా జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించగా... ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఇక భక్తుల తాకిడిని దృష్టిలో పెట్టుకుని లడ్డూ, పులిహోర ప్రసాదాలను రెడీ చేస్తున్నారు.

వరంగల్ భద్రకాళి ఆలయం:

వరంగల్ భద్రకాళి ఆలయంలో శరన్నవరాత్రి వేడుకలు తుది అంకానికి చేరుకున్నాయి. నవరాత్రుల్లో నవదుర్గా రూపాల్లో అలరించిన భద్రకాళి అమ్మవారు విజయదశమి వేళ భక్తులకు నిజరూప దర్శనమిస్తోంది. ఉదయం నుంచే ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ ఈఓ శేషుభారతి తెలిపారు.

విశాఖలో వైభవంగా దసరా శరన్నవరాత్రులు:

విశాఖ కనకమహాలక్ష్మి ఆలయంలో శరన్నవరాత్రుల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తొమ్మిది రోజలు పాటు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పూజలు నిర్వహించారు. భక్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్నవారిని దర్శించుకుంటున్నారు. ఏలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

విజయవాడలోని ఇంద్రకీలాద్రి:

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈరోజు అమ్మవారు రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఇవాళ పూర్ణాహుతితో ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు పూర్తి కానున్నాయి. సాయంత్రం కృష్ణానది ఒడ్డున ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు చేయనున్నారు అర్చకులు. నదిలో నీటి ఉద్ధృతి కారణంగా ఉత్సవ మూర్తులకు జలవిహారం రద్దు చేశారు. దసరా చివరి రోజు భారీగా భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచే క్యూలైన్లలో భారీగా వేచి ఉన్నారు. క్యూలైన్లలో ఆలస్యం కావడంతో పోలీసులతో భక్తులు వాగ్వాదానికి దిగారు. గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోందంటూ ఆందోళన వ్యక్తంచేశారు.

హైదరాబాద్ అష్టలక్ష్మి ఆలయంలో:

హైదరాబాద్ అష్టలక్ష్మి ఆలయంలో దసరా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తెల్లవారుజాము నుంచే బారులు తీరారు.. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులకు దర్శన ఏర్పాట్లను చేశారు ఆలయ అధికారులు.

కడపలో విజయదశమి వేడుకలు:

కడపలో విజయదశమి వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. తెల్లవారుజామున అమ్మవారికి కలశాభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వివిధ రకాల పుష్పాలతో అలకరించి భక్తుల దర్శనానికి అనుమతించారు. నగరంలోని విజయదుర్గా, వాసవీ కన్యకా మాత, అమ్మవారి ఆలయాలు కిటకిటలాడాయి. ఉదయం నుంచి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూ లైన్‌లో బారులు తీరారు. సాయంత్రం శమీ దర్శన అనంతరం దుర్గామాతను ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిపై పురవీధుల గుండా ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

Tags:    

Similar News