Telangana: తెలంగాణ ప్రభుత్వ ఆస్పత్రుల్లో డాక్టర్ల కొరత

Telangana: ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లో జూనియర్ డాక్టర్లకు ఓవర్ డ్యూటీలు

Update: 2022-05-16 05:24 GMT

Telangana: తెలంగాణ ప్రభుత్వ ఆస్పత్రుల్లో డాక్టర్ల కొరత

Telangana: సర్కారు ఆస్పత్రులు డాక్టర్ల కొరత ఇబ్బందికరంగా మారింది. రోజువారి వచ్చే రోగులకు, ఇన్‌ పేషంట్లకు సేవలు అందించేందుకు అత్యవసర సేవలు చేయడానికి డాక్టర్లు సతమతమవుతున్నారు. యేళ్ల తరబడి ఖాళీగా ఉన్న పోస్టుల్ని భర్తీ చేసేందుకు ప్రభుత్వ అధికార యంత్రాంగం చర్యలు తీసుకోకపోవడంతో ఉన్న డాక్టర్లపై ఒత్తిడి పెరుగుతోంది. తెలంగాణ వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో డాక్టర్ల కొరత సమస్యగా మారింది.

హైదరాబాద్‌లో పేదప్రజానీకానికి వైద్యసేవలు అందించే గాంధీ ఆస్పత్రి, ఉస్మానియా ఆస్పత్రుల్లో డాక్టర్ల కొరత సమస్యగా తయారైంది. డాక్టర్ల కొరతవల్ల ఉన్నడాక్టర్లపై పనిభారం పెరుగతోంది. అంతేగాకుండా ఉన్నడాక్టర్లే ఎక్కు సమయం పనిచేయాల్సి వస్తోంది. రోగులకు నిత్యం డాక్టర్లు అందుబాటులో ఉండాలంటే ఎక్కువగంటలు పనిచేయాల్సి వస్తోందని జూనియర్ డాక్టర్లు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. చిరుప్రాయంలోనే ఎక్కువ గంటలు పనిచేయాల్సి వస్తోందని జూనియర్ డాక్టర్లు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

పని ఒత్తిడివల్ల ఆరోగ్యంపై తీవ్రప్రభావం చూపడమేగాకుండా... చిరుప్రాయంలోనే ప్రాణాలమీదికి తెచ్చుకోవాల్సి వస్తోందనే అభిప్రాయం డాక్టర్లలో వ్యక్తమవుతోంది. నిత్యం రోగులతో రద్దీగా ఉండే గాంధీ, ఉస్మానియాతోపాటు తెలంగాణలోని ఏరియా ఆస్పత్రుల్లో డాక్టర్ల కొరత తీవ్రంగా ఉంది. కొత్త నియామాకాలు చేపడితే ఉన్నడాక్లర్లపై ఒత్తిడి తగ్గి రోగులకు సంతృప్తికర సేవలు అందేవీలుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Full View


Tags:    

Similar News