Telangana: ఉద్యోగులపై ప్రేమతో పీఆర్సీ ప్రకటించలేదు-డీకే అరుణ

Telangana: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి చెందితే భవిష్యత్ లేదని టీఆర్ఎస్ దొడ్డిదారులు చూసుకుందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శించారు.

Update: 2021-03-24 13:18 GMT

Telangana: ఉద్యోగులపై ప్రేమతో పీఆర్సీ ప్రకటించలేదు-డీకే అరుణ

Telangana: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి చెందితే భవిష్యత్ లేదని టీఆర్ఎస్ దొడ్డిదారులు చూసుకుందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శించారు. ఎన్నికల్లో గెలువలేమనే దురుద్దేశ్యంతో పీఆర్సీ ప్రకటన చేశారని ఆరోపించారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంచి నిరుద్యోగులను మోసం చేస్తున్నారంటూ డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కోవిడ్ నిబంధనలు తప్పక పాటించాలని డీకే అరుణ తెలిపారు.

Tags:    

Similar News