తెలంగాణ వ్యాప్తంగా నేడు పోడు పట్టాల పంపిణీ

Telangana: మహబూబాబాద్‌ జిల్లాలో పట్టాలు పంపిణీ చేయనున్న మంత్రి కేటీఆర్‌

Update: 2023-06-30 03:07 GMT

తెలంగాణ వ్యాప్తంగా నేడు పోడు పట్టాల పంపిణీ

Telangana: తెలంగాణ సీఎం కేసీఆర్‌ పోడు పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టనుండగా.. అనంతరం జిల్లాల్లో మంత్రులు పట్టాలు పంపిణీ చేయనున్నారు. అందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రాష్ట్ర మంత్రులు హరీష్‌రావు, పువ్వాడ అజయ్‌.. మహబూబాబాద్‌ జిల్లాలో మంత్రులు కేటీఆర్‌, సత్యవతిరాథోడ్ పట్టాలు అందించనున్నారు. మహబూబాబాద్‌ ఎన్టీఆర్‌ స్టేడియంలో నిర్వహించే సభలో జిల్లాలోని 24 వేల 181 మంది పోడు రైతులకు 67వేల 730ఎకరాల పోడు భూములకు పట్టాలు అందించనున్నారు మంత్రి కేటీఆర్‌. మిగిలిన నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల నేతృత్వంలో పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమం జరగనుంది.

Tags:    

Similar News