టీఆర్‌ఎస్ మంచినీటిపై ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్.. ప్లకార్డులు, ఖాళీ బిందెలతో రోడ్డుపై నిరసన

Hyderabad: హైదరాబాద్ ఎల్బీనగర్‌లో బీజేపీ శ్రేణుల ధర్నా

Update: 2022-12-06 07:47 GMT

టీఆర్‌ఎస్ మంచినీటిపై ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్.. ప్లకార్డులు, ఖాళీ బిందెలతో రోడ్డుపై నిరసన

Hyderabad: హైదరాబాద్ ఎల్బీనగర్‌లోని జలమండలి ఆఫీస్ వద్ద బీజేపీ శ్రేణులు ధర్నాకు దిగాయి. బీజేపీ నాయకులు సామ రంగారెడ్డి ఆధ్యర్యంలో జరిగిన ఈ ధర్నాలో బీజేపీ కార్యకర్తలు,మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని నిరసన వ్యక్తం చేస్తూ.. ప్లకార్డులతో, ఖాళీ బిందెలతో రోడ్డుపై ధర్నా చేశారు. అప్పుడు ఇంటింటికి ఉచిత మంచినీటి సరఫరా ఇస్తామని చెప్పి.. ఇప్పుడు వేలాది రూపాయల మంచి నీటిపై బిల్లులు వేస్తూ మధ్య తరగతి ప్రజల నడ్డి విరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ధర్నావల్ల ఎల్బీనగర్, దిల్‌షుఖ్‌నగర్ రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి నిరసనకారులను అక్కడ నుంచి పంపించారు.

Tags:    

Similar News