DCP: ప్రేమ వ్యవహారమే ప్రవళిక ఆత్మహత్యకు కారణం
DCP Venkateswarlu: ప్రవళిక ఆత్మహత్యపై డీసీపీ వెంకటేశ్వర్లు వివరణ ఇచ్చారు.
DCP: ప్రేమ వ్యవహారమే ప్రవళిక ఆత్మహత్యకు కారణం
DCP Venkateswarlu: ప్రవళిక ఆత్మహత్యపై డీసీపీ వెంకటేశ్వర్లు వివరణ ఇచ్చారు. ప్రవళిక ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని తెలిపారు. 15 రోజుల క్రితమే ప్రవళిక హాస్టల్‌లో చేరిందని.. ప్రవళిక సూసైడ్ నోట్ దొరికిందని వివరించారు. సూసైడ్ నోట్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించామని.. ప్రేమ వ్యవహారం తల్లిదండ్రులకు తెలుసని చెప్పుకొచ్చారు. శివరామ్ రాథోడ్‌తో ప్రవళిక చివరి కాల్ మాట్లాడిందని.. శివరామ్‌కు మరో యువతితో ఎంగేజ్‌మెంట్ జరిగిందని వివరించారు. పూర్తి దర్యాప్తు తర్వాత శివరాంపై చర్యలు తీసుకుంటామన్నారు. ప్రవళిక మృతికి పరీక్షల వాయిదాకి ఎలాంటి సంబంధం లేదన్నారు.