Singareni: సింగరేణి కార్మికులకు దసరా బోనస్.. ఒక్కో కార్మికుడికి రూ.1.53 లక్షలు
Singareni: పండగకు మూడు రోజుల ముందే కార్మికుల ఖాతాల్లో నగదు జమ
Singareni: సింగరేణి కార్మికులకు దసరా బోనస్.. ఒక్కో కార్మికుడికి రూ.1.53లక్షలు
Singareni: సింగరేణి కార్మికులకు బోనస్ కింద తెలంగాణ ప్రభుత్వం రూ.711 కోట్లు విడుదల చేసింది. దీంతో ఒక్కో కార్మికుడికి రూ.1.53లక్షల బోనస్ ఇవ్వనున్నట్టు యాజమాన్యం వెల్లడించింది. ఈ నిర్ణయంతో సింగరేణిలో పనిచేస్తున్న 42వేల మంది కార్మికులకు లబ్ది చేకూరనుంది. కాగా... సింగరేణి లాభాల వాటా కోసం కార్మికులు గత కొంత కాలంగా ఎదురుచూస్తున్నారు. కొన్ని కారణాల వల్ల ఆలస్యంగా కార్మికుల ఖాతాల్లోకి జమ చేయనున్నట్టు సింగరేణి యాజమాన్యం తెలిపింది. పండగకు మూడు రోజుల ముందే కార్మికుల ఖాతాల్లో ఈ నగదు జమ కానున్నట్టు తెలుస్తుంది. సింగరేణి లాభాల వాటాను కార్మికులకు పంచడంతో.. కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.