దళితుల మధ్య మూడెకరాల చిచ్చు

Update: 2020-12-12 10:43 GMT

మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం బొమ్మకల్ గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. గతంలో 20 మంది దళితులకు ఒక్కొక్కరికి 3ఎకరాల చొప్పున ప్రభుత్వం భూ పంపిణీ చేసింది. అయితే 60 మంది దళిత కుటుంబాలు ఒక్కొక్కరు ఎకరం చొప్పున తీసుకోవాలని సర్పంచ్‌ ఆధ్వర్యంలో ఒప్పందం కుదుర్చుకున్నారు. కానీ ఇప్పుడు 20మంది లబ్ధిదారులు 60 ఎకరాలు తమకే చెందుతుందని ఆందోళనకు దిగారు. దీంతో మిగిలిన లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలని కూడా చూడకుండా విచక్షణరహితంగా దాడి చేశారు. గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పెద్దవంగర ఎస్సై జితేందర్ పరిస్థితిని సమీక్షించి, ఆరుగురుపై కేసు నమోదు చేశారు.

Tags:    

Similar News