వీడు మామూలోడు కాదు.. ఇన్‌స్టాగ్రామ్‌లో అమ్మాయిల‌కు వ‌ల‌.. 60 మంది నుంచి రూ. 4 కోట్లు వ‌సూలు..

Hyderabad: అమెరికాకు చెందిన యువతి 25 లక్షలు ఇచ్చి మోసపోయానని ఫిర్యాదు

Update: 2022-07-15 09:54 GMT

ఇన్‌స్టాగ్రామ్‌లో అమ్మాయిల‌కు వ‌ల‌.. 60 మంది నుంచి రూ. 4 కోట్లు వ‌సూలు

Hyderabad: సామాజిక మాధ్యమాల్లో యువతులతో పరిచయాలు పెంచుకుని మోసాలకు పాల్పడుతున్న కేటుగాడిని సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. వేర్వేరు సందర్భాల్లో 60 మందిచేత నాలుగుకోట్ల రూపాయలమేర వసూలే చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. రంగంలోకి దిగిన పోలీసులు కేటుగాడి ఆటకట్టించారు. పిటీ వారెంట్‌పై నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రాజమండ్రికి చెందిన వంశీకృష్ణ.. బీటెక్ పూర్తి చేశాడు.

ఇన్స్టాగ్రామ్ లో అమ్మాయిల పేరుతో ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి పరిచయాలు పెంచుకుని మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. ఆ ఫేక్ అకౌంట్లతో హై ప్రొఫైల్ వ్యక్తిగా యువతులే టార్గెట్‌గా ఎంచుకున్నాడు. అమెరికాలో ఉంటున్న ఓ యువతి 25 లక్షలరూపాయలమేర మోసపోయి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదుచేయడంతో అసలు విషయం వెలుగుచూసింది. నిందితుడు వంశీకృష్ణ పై గతంలో రాచకొండ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కాకినాడ, జోగులాంబ గద్వాల్, నిజామాబాద్, ఖమ్మం, భీమవరం, వైజాగ్, కరీంనగర్, విజయవాడలలో ఈ తరహా కేసులు నమోదైనట్లు పోలీసులు గుర్తించారు.

Tags:    

Similar News