తెలంగాణలో జడలు విప్పిన కరోనా.. ఇవాళ అత్యధికంగా 879 కేసులు
తెలంగాణలో కరోనా జడలు విప్పింది. రాష్ట్రంలో నేడు అత్యధికంగా 879 కేసులు నమోదయ్యాయి.
తెలంగాణలో కరోనా జడలు విప్పింది. రాష్ట్రంలో నేడు అత్యధికంగా 879 కేసులు నమోదయ్యాయి. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలో 652 కేసులు నమోదు చేసుకున్నాయి. ఇవ్వాళ 3 మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో పోరాడి 220 మంది మరణించారు. దినికి సంబంధించిన హెల్త్ బులిటెన్ ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 9553 కి చేరింది. ఇప్పటి వరకు కరోనాతో పోరాడి 4224 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 5109 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.
భారత్‌లో కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 14,933 కేసులు నమోదు కాగా, 312 మంది ప్రాణాలు విడిచారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం దేశంలో మొత్తం 4,40,215 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు1,78,014 ఉండగా, 2,48,189 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా 14,011 మంది కరోనా వ్యాధితో మరణించారు. గడచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 1,87,223 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు. ఇప్పటి వరకు దేశంలో 71,37,716 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు.