Karimnagar: కరీంనగర్‌లో రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ నిరసన
Karimnagar: కరీంనగర్‌లో రిటైర్డ్ ఉద్యోగుల అసోసియేషన్ చేపట్టిన నిరసనకు బిఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ మద్దతు తెలిపారు.
Karimnagar: కరీంనగర్‌లో రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ నిరసన
కరీంనగర్: రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన బిఆర్ఎస్ పార్టీ నగర శాఖ అధ్యక్షులు చల్ల హరిశంకర్. రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ తెలంగాణ కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని సచివాలయం ఎదురుగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. వీరికి మద్దతుగా నగర బిఆర్ఎస్ అధ్యక్షులు చల్ల హరిశంకర్ మద్దతు తెలుపుతూ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రిటైర్డ్ ఉద్యోగులు ప్రజలకు ఎంతో సేవ చేసి ఉన్నారని ఉద్యోగ సమయంలో వారు దాచుకున్న డబ్బులు ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. 25 వేల మంది రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నారని వారు రిటైర్డ్ అనంతరం పిల్లల వివాహానికి కావచ్చు ఇల్లు నిర్మించుకోవడం కోసం కావచ్చు ఇలా భవిష్యత్తు కొరకు ఉద్యోగం చేస్తున్న సమయంలో దాచుకున్న డబ్బును రిటైర్డ్ అయిన తర్వాత వస్తుందని ఎదురు చూసే వారికి కాంగ్రెస్ ప్రభుత్వం మొండిచేయి చూపిందన్నారు. రిటైర్డ్ బెనిఫిట్స్ రాక రెండున్నరెండ్లుగా సుమారు 50మంది వరకు మానసికక్షోభకు గురై మరణించడం చాలా బాధాకరమన్నారు.
ప్రభుత్వ ఉద్యోగుల కృషి మరువలేనిది..
కాంట్రాక్ట్ లలో కమిషన్ల కోసం ప్రభుత్వం సుమారు 63 వేల కోట్లను విడుదల చేసిందని ఆరోపించారు. కేవలం గత ప్రభుత్వం ముందు ఉండడంలో ప్రభుత్వ ఉద్యోగుల కృషి మరువలేనిదన్నారు. కేవలం కక్ష సాధింపు ధోరణితో మాత్రమే రిటేడ్ ఉద్యోగుల బెనిఫిట్స్ను ప్రభుత్వం విడుదల చేయలేదని ఆరోపించారు.రిటైర్డ్ ఉద్యోగుల పక్షాన బారాస డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు అసెంబ్లీలో మాట్లాడాలని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
రిటైర్డ్ ఎంప్లాయిస్ హక్కుల సాధన కోసం బారాసా ఎప్పుడు మద్దతు ఇస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ బాధ్యులతోపాటు నగర బిఆర్ఎస్ అధ్యక్షులు చల్ల హరిశంకర్ ,బిఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ లు,బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.