Karimnagar: నిబంధనలు పాటిస్తేనే ప్రాణాలు పదిలం.. సీపీ గౌష్ ఆలం

Karimnagar: కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ‘అరైవ్ - అలైవ్’ మూడవ దశ కార్యక్రమాన్ని సీపీ గౌష్ ఆలం ప్రారంభించారు.

Update: 2026-03-31 11:09 GMT

Karimnagar: నిబంధనలు పాటిస్తేనే ప్రాణాలు పదిలం.. సీపీ గౌష్ ఆలం

​కరీంనగర్: రోడ్డు ప్రమాదాల నివారణ కేవలం పోలీసుల చర్యలతోనే సాధ్యం కాదని, వాహనదారులు ట్రాఫిక్ నిబంధనల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండి, వాటిని బాధ్యతాయుతంగా పాటించినప్పుడే ప్రమాద రహిత సమాజం సాధ్యమవుతుందని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం అన్నారు.

కరీంనగర్ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో, ఆటో డ్రైవర్లు , రాపిడో కెప్టెన్ల కోసం స్థానిక అస్త్ర కన్వెన్షన్ హాలునందు ఏర్పాటు చేసిన ‘అరైవ్ - అలైవ్’ (ARRIVE - ALIVE) మూడవ దశ అవగాహనా కార్యక్రమానికి సీపీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

​​మానవ తప్పిదాలే మరణ శాసనం..

గత ఏడాది కమిషనరేట్ పరిధిలో రోడ్డు ప్రమాదాల వల్ల 200 మంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని సీపీ ఆవేదన వ్యక్తం చేశారు. హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించకపోవడం, అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం వంటి అజాగ్రత్తల వల్లే ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయని తెలిపారు. ​బాధితుల్లో పురుషులే ఎక్కువ, ప్రమాదాల్లో మరణించిన వారిలో 85 శాతం మంది పురుషులే ఉండటం గమనార్హమని, ఒక వ్యక్తి మరణం ఆ కుటుంబం మొత్తాన్ని వీధిన పడేస్తుందని గుర్తు చేశారు.

​బ్లాక్ స్పాట్లపై నిఘా ఏర్పాట్లు ..

కరీంనగర్ నుండి హైదరాబాద్, వరంగల్, జగిత్యాల, సిరిసిల్ల మరియు చొప్పదండి వెళ్లే రహదారుల్లో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్న ‘బ్లాక్ స్పాట్లను’ గుర్తించామని, అక్కడ ప్రత్యేక నిఘాతో పాటు హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా హుజురాబాద్ లింగాపూర్ క్రాస్ రోడ్డు వద్ద ఇప్పటికే సైన్ బోర్డులు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ప్రతి డ్రైవర్ పరిసరాలను గమనిస్తూ వాహనం నడిపే ‘డిఫెన్సివ్ డ్రైవింగ్’ పద్ధతిని అలవరచుకోవాలని సూచించారు.

Tags:    

Similar News