Karimnagar: ఆపదలో ప్రాణం కాపాడండి.. ‘రహవీర్’గా నిలవండి

Karimnagar: కరీంనగర్‌లో రోడ్డు ప్రమాద బాధితులను కాపాడేందుకు ఆటో డ్రైవర్లకు మెడికవర్ ఆసుపత్రి వైద్యులు సీపీఆర్ (CPR) విధానంపై శిక్షణ ఇచ్చారు.

Update: 2026-03-31 11:24 GMT

Karimnagar: ఆపదలో ప్రాణం కాపాడండి.. ‘రహవీర్’గా నిలవండి

కరీంనగర్: ఆపద సమయంలో సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడే విధానాన్ని ఆటో డ్రైవర్లకు పోలీసులకు వివరించిన మెడికవర్ ఆసుపత్రి వైద్యులు. మెడికవర్ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ లోకేష్ బృందం ప్రమాద సమయంలో ప్రాణాలు కాపాడే CPR (Cardiopulmonary Resuscitation) విధానంపై డ్రైవర్లకు ప్రత్యక్ష ప్రదర్శన ఇచ్చారు. ఏ విధంగా సిపిఆర్ చేయాలో విషయాన్ని ప్లాస్టిక్ బొమ్మ తో డ్రైవర్లకు ప్రత్యక్ష ప్రదర్శన ఇచ్చారు.

ఆపదలో ప్రాణాలను కాపాడిన వారికి రహవీర్ పథకం..

ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ మాట్లాడుతూ హిట్ అండ్ రన్ చట్టాలపై అవగాహన కల్పించారు. ప్రమాద బాధితులను సకాలంలో ఆసుపత్రికి చేర్చి ప్రాణాలు కాపాడిన వారికి ‘రహవీర్’ పథకం కింద ప్రభుత్వం రూ. 25,000 నగదు ప్రోత్సాహకం అందిస్తుందని తెలిపారు. ఒక మనిషి ప్రాణం కాపాడడం ఎంతో విలువైనదని అలాంటి ప్రాణాలను కాపాడే వారికి ప్రభుత్వం ఇలాంటి పథకాలు అందించి ప్రోత్సహిస్తుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ వెంకటరమణతో పాటు, ట్రాఫిక్ ఏసీపీ యాదగిరి స్వామి , ఇన్స్పెక్టర్లు సంజీవ్ , కుమారస్వామి , కిరణ్ కుమార్ , మెడికవర్ ఆసుపత్రి డాక్టర్ లోకేష్, రాపిడో అసోసియేట్ మేనేజర్ దుర్గా రావు ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Tags:    

Similar News