Karimnagar: బేకరీ ఫుడ్ తింటున్నారా? అయితే ఈ వార్త మీకోసమే!

Karimnagar: ఎగ్ పఫ్ నుండి దుర్వాసన రావడంతో కస్టమర్ ఫిర్యాదు.. రంగంలోకి దిగిన కరీంనగర్ ఫుడ్ సేఫ్టీ టీమ్. తనిఖీల్లో వెలుగుచూసిన భయంకరమైన నిజాలు.

Update: 2026-03-31 07:05 GMT

Karimnagar: బేకరీ ఫుడ్ తింటున్నారా? అయితే ఈ వార్త మీకోసమే!

కరీంనగర్: కరీంనగర్ పట్టణంలో బేకరీలు ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నాయి. ఏమరు పాటుగా బేకరీ ఫుడ్ తింటివా ఆస్పత్రి పాలు కావాల్సిందే.

కరీంనగర్‌లోని రేకుర్తి ప్రాంతంలో ఉన్న గణేష్ బెంగళూరు బేకరీ నుండి ఆర్డర్ చేసిన ఎగ్ పఫ్ నుండి దుర్వాసన వస్తోందని ఫుడ్ సేఫ్టీ కార్యాలయానికి ఫిర్యాదు అందింది. ఫిర్యాదు ఆధారంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు పేర్కొన్న ప్రాంగణంలో తనిఖీలు నిర్వహించారు.

కుళ్ళిన పాడైన కోడిగుడ్లతో కేకులు తయారీ..

తనిఖీలు నిర్వహించిన ఫుడ్ సేఫ్టీ అధికారులకు కళ్ళు బైర్లు కమ్మే నిజాలు బయటపడ్డాయి. కేకుల తయారీ విషయంలో నిర్వాహకులు అయిపోయిన కూలిన కోడిగుడ్లను వినియోగిస్తున్నట్లు గుర్తించిన అధికారులు.

కేకులు బిస్కెట్లు తయారు చేసే ప్రాంతం పూర్తిగా అపరిశుభ్రంగా ఉందని అన్నారు. పురుగులు పట్టిన మైదా నిల్వ ఉంచిన క్రీమ్లలో సైతం పురుగులు ఉన్నాయని గుర్తించారు. ఫ్రీజర్ లో నిలువచేసిన షుగర్ సిరప్సిరప్, క్రీమ్ లో కూడా పురుగులు కనిపించాయన్నారు.

వస్తువులు నిల్వ ప్రాంతంలో 14 ట్రేలు పగిలిన గుడ్లు (మొత్తం 420 గుడ్లు) గుర్తించబడ్డాయి. ఈ పగిలిన గుడ్ల కారణంగా వంటగది ప్రాంతం మొత్తం ఈగలతో నిండిపోయింది.పగిలిన గుడ్లతో తయారు చేసిన సుమారు రూ. 7000 విలువైన కేకులు బేకరీలో ఉన్నట్లు గుర్తించారు. పాడైన గుడ్లు కేకులను అధికారులు అక్కడికక్కడే తొలగించి పారవేశారు. తనిఖీలలో సుమారు రూ. 9000 విలువైన నిల్వ ను అధికారులు తొలగించి వేశారు.

బేకరీ యొక్క FSSAI లైసెన్స్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. అవసరమైన సరిదిద్దే చర్యలు తీసుకునే వరకు బేకరీ నిర్వహణకు అనుమతి రద్దు చేసినట్లు తెలిపారుతెలిపారు. ఫుడ్ సేఫ్టీ నిబంధనల ఉల్లంఘన కారణంగా ఫుడ్ సేఫ్టీ చట్టం, 2006 ప్రకారం అడ్జుడికేషన్ చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.

Tags:    

Similar News