Kavitha: ఒక్కో కుటుంబంపై రూ. 9 లక్షల అప్పు: ఏడాదిలో 363 రోజులు అప్పులతోనే.. కవిత సంచలన పోస్ట్!
Kavitha: తెలంగాణ ఆర్థిక పరిస్థితి బాగోలేదని.. అప్పుల్లో నెట్టుకొస్తోందన్న కాగ్ నివేదికపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత స్పందించారు.
Kavitha: ఒక్కో కుటుంబంపై రూ. 9 లక్షల అప్పు: ఏడాదిలో 363 రోజులు అప్పులతోనే.. కవిత సంచలన పోస్ట్!
Kavitha: తెలంగాణ ఆర్థిక పరిస్థితి బాగోలేదని.. అప్పుల్లో నెట్టుకొస్తోందన్న కాగ్ నివేదికపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా కీలక పోస్టు పెట్టారు. రాష్ట్ర రోజువారీ ఖర్చులకు ఆర్బీఐ దగ్గర చేయి చాచాల్సిన దుస్థితిలోకి తెలంగాణను కాంగ్రెస్ నెట్టేసిందని కాగ్ 2024 - 25 నివేదిక బట్టబయలు చేసిందని ఆమె కవిత అన్నారు. ఏడాదిలో రెండు రోజులు తప్ప మిగిలిన 363 రోజులు ఆర్బీఐ నుంచి వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్, స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీస్, ఓవర్ డ్రాఫ్ట్‌ల పేరుతో చేబదుళ్లు చేసిందని అన్నారు.
2024 - 25 ఆర్థిక సంవత్సరంలో 1.30 లక్షల కోట్లు తెచ్చి సర్కారును నెట్టుకొచ్చిందని కాగ్ నివేదిక వెల్లడించిందని ఆమె అన్నారు. ఒక్కో కుటుంబంపై 9 లక్షల అప్పు మోపిందని కాంగ్రెస్‌పై కవిత ఫైరయ్యారు. రోజువారీ ఖర్చులకు ఆర్బీఐ దగ్గర చేయి చాపుతూ.. మిగులు బడ్జెట్ రాష్ట్రమని చెప్పడం విడ్డూరమని ఆమె అన్నారు. ఎన్నికలకు ముందు సంపదపెంచుతాం.. దానిని పేదలకు పంచుతాం అన్న కాంగ్రెస్ నాయకుల మాటలు వట్టి డొల్ల అని కాగ్ నివేదికతో బట్టబయలు అయ్యిందని కవిత కీలక వ్యాఖ్యలు చేశారు.