Jupally Krishna Rao: ఏపీ ప్రభుత్వానికి మంత్రి జూపల్లి వార్నింగ్...
Jupally Krishna Rao: కృష్ణా నదీ జలాల పంపిణీ అంశంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
Jupally Krishna Rao: ఏపీ ప్రభుత్వానికి మంత్రి జూపల్లి వార్నింగ్..
Jupally Krishna Rao: కృష్ణా నదీ జలాల పంపిణీ అంశంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఏపీ ప్రభుత్వం అక్రమంగా నీటిని తరలించే ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరుకోబోమని, పాలమూరు రైతాంగ ప్రయోజనాలే తమకు ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు.
తాగునీటికే ప్రాధాన్యత ఉండాలి:
నీటి వినియోగంపై మంత్రి జూపల్లి కీలక వ్యాఖ్యలు చేశారు. "పునర్విభజన చట్టం ప్రకారం 834 టీఎంసీల కంటే దిగువన ఉన్నప్పుడు కేవలం తాగునీటి అవసరాల కోసం మాత్రమే నీటిని వాడుకోవాలి. కానీ, దానికి విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం నీటిని తరలిస్తోంది. తెలంగాణలో పంటలు ఎండుతుంటే ఏపీకి నీటి తరలింపు ఎలా సాధ్యమవుతుంది?" అని ఆయన ప్రశ్నించారు.
గత ప్రభుత్వ తప్పిదాలపై విమర్శలు:
శ్రీశైలం ప్రాజెక్టులో జరుగుతున్న నీటి దోపిడీపై గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని జూపల్లి విమర్శించారు. గత పదేళ్ల పాలనలో చేసిన తప్పిదాలను ఏపీ ప్రభుత్వం ఇప్పుడు అలుసుగా తీసుకుంటోందని మండిపడ్డారు. తెలంగాణ హక్కులను గత పాలకులు తాకట్టు పెట్టారని, కానీ ఇప్పుడు తమ ప్రభుత్వం పాలమూరు రైతుల హక్కులను కచ్చితంగా కాపాడుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.
పోరాటానికి సిద్ధం:
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పరిధిలోని రైతాంగానికి నష్టం కలిగించే ఏ ప్రయత్నాన్ని అయినా అడ్డుకుంటామని జూపల్లి హెచ్చరించారు. అక్రమ నీటి తరలింపును అడ్డుకోవడానికి అవసరమైతే పోరాటానికైనా సిద్ధమని పిలుపునిచ్చారు. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం చట్టబద్ధంగా వ్యవహరించాలని సూచించారు.