తెలంగాణలో కరోనా పంజా.. కొత్తగా 546 కేసులు

నేడు అత్యధికంగా 546 కేసులు నమోదయ్యాయి. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలో 458 కేసులు నమోదు చేసుకున్నాయి.

Update: 2020-06-20 16:30 GMT

నేడు అత్యధికంగా 546 కేసులు నమోదయ్యాయి.  ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలో 458 కేసులు నమోదు చేసుకున్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో పోరాడి 203 మంది మరణించారు. దినికి సంబంధించిన హెల్త్ బులిటెన్ ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 7,072 కి చేరింది. ఇప్పటి వరకు కరోనాతో పోరాడి 3506 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 3363 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. 

భారత్‌లో‌ కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 14,516 కేసులు నమోదు కాగా, 375 మంది ప్రాణాలు విడిచారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం దేశంలో మొత్తం 3,95,048 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1,68,269 ఉండగా, 2,13,830 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా 12,948 మంది కరోనా వ్యాధితో మరణించారు



 


Tags:    

Similar News