TG Inter Result Date 2026: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఫలితాల విడుదల తేదీ వచ్చేసింది..?

TG Inter Result Date 2026: తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు రాసిన లక్షలాది మంది విద్యార్థుల నిరీక్షణకు తెరపడనుంది.

Update: 2026-03-24 07:28 GMT

TG Inter Result Date 2026: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఫలితాల విడుదల తేదీ వచ్చేసింది..?

TG Inter Result Date 2026: తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు రాసిన లక్షలాది మంది విద్యార్థుల నిరీక్షణకు తెరపడనుంది. ఫలితాల వెల్లడిపై ఇంటర్ బోర్డు కసరత్తును ముమ్మరం చేసింది. ఎక్కడా చిన్న పొరపాట్లకు కూడా తావులేకుండా అత్యంత పారదర్శకంగా, రికార్డు సమయంలో ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు పక్కా ప్లాన్‌తో ముందుకు వెళ్తున్నారు.

కీలక తేదీలు ఇవే (అంచనా):

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా జవాబు పత్రాల మూల్యాంకనం (Spot Valuation) శరవేగంగా జరుగుతోంది.

ఏప్రిల్ 3: వాల్యుయేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని లక్ష్యం.

ఏప్రిల్ 4 - 6: కోడింగ్, డీకోడింగ్ మరియు సాంకేతిక తనిఖీలు.

ఏప్రిల్ 8 లేదా 9: ఫలితాల విడుదలయ్యే అవకాశం ఉంది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందుబాటును బట్టి బోర్డు ఒక తేదీని ఖరారు చేయనుంది. మొత్తానికి ఏప్రిల్ 10 లోపు విద్యార్థుల చేతికి మార్కుల జాబితా అందనుంది.

డబుల్ వాల్యుయేషన్.. తప్పులకు నో ఛాన్స్!

గతంలో ఫలితాల వెల్లడిలో ఎదురైన సాంకేతిక ఇబ్బందులు, చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి పేపర్‌ను రెండుసార్లు వాల్యుయేషన్ చేసేలా ఏర్పాట్లు చేశారు. వాల్యుయేషన్ కేంద్రాలను బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య నేతృత్వంలో కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. నాణ్యత దెబ్బతినకుండా ఉండేందుకు ఒక్కో అధ్యాపకుడికి రోజుకు కేవలం 25 నుంచి 30 పేపర్లు మాత్రమే కేటాయించారు.

అధ్యాపకులకు గుడ్ న్యూస్:

మూల్యాంకన విధుల్లో ఉన్న అధ్యాపకులకు ఇంటర్ బోర్డు ఈసారి రెమినరేషన్ పెంచింది. పనిభారం తగ్గించడం వల్ల పేపర్లను మరింత నిశితంగా పరిశీలించే అవకాశం ఉంటుందని, తద్వారా విద్యార్థులకు న్యాయం జరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఉదయం 9 నుండి సాయంత్రం 5 గంటల వరకు స్పాట్ ప్రక్రియ నిరాటంకంగా సాగుతోంది.

Tags:    

Similar News