Armoor: రూ. 5 లక్షల బీమాతో పేద కుటుంబాలకు భరోసా.. ఇందిరమ్మ పథకం చరితాత్మకం: దొండి రమణ
Armoor; తెలంగాణ బడ్జెట్ 2026-27లో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి రూ. 4వేల కోట్ల కేటాయింపు. కోటి 15 లక్షల కుటుంబాలకు రూ. 5 లక్షల ఉచిత బీమా ధీమా.
Armoor; ఇందిరమ్మ బీమాతో కోటి కుటుంబాలకు భరోసా బడ్జెట్ కేటాయింపులపై హర్షం
ఆర్మూర్ న్యూస్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2026-2027 హర్షిక బడ్జెట్ లో ప్రజలకు పలు నూతన పథకాలలో ఆకర్షవంతమైనటువంటి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా ఉచిత పథకం తీసుకురావడం ఈ పథకానికి 2026-2027 బడ్జెట్ ప్రతిపాదనలో 4 వేలు కోట్లు కేటాయిస్తూ ఈ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో సుమారు 1 కోటి 15 లక్షల కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడం ఒక చారిత్రాత్మక నిర్ణయం.
ఈ నూతన పథకం, సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధి ద్వేయంగా రాష్ట్ర ప్రభుత్వం పేద, ధనిక, మధ్య తరగతి అనే తేడా లేకుండా ప్రతి కుటుంబానికి 5 లక్షల జీవిత ఉచిత బీమాను కుటుంబంలో సంపాదించే కుటుంబ పెద్ద దురదృష్టవశాత్తు మరణిస్తే కుటుంబం రోడ్డున పడకుండా ఆర్థిక విపత్తులో చిక్కకుండా ఆ కష్ట పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ కుటుంబానికి అండగా ఇందిరమ్మ కుటుంబ జీవిత ఉచిత బీమా నూతన పథకం ద్వారా 5 లక్షల రూపాయలు తో ప్రతి కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పిస్తూ రాష్ట్రంలో లక్షలాది కుటుంబాలకు భరోసా.
రాష్ట్రంలో 1 కోటి 15 లక్షలు కుటుంబాలకు వర్తించే ఈ నూతన పథకాన్ని తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2 నా ఇందిరమ్మ కుటుంబ జీవిత ఉచిత నూతన బీమా పథకాన్ని ప్రారంభించడం చారిత్రాత్మక నిర్ణయం, ఈ నూతన పథకాన్ని రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి, గ్రామం, పట్టణాలలో ప్రతి నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ కుటుంబం జీవిత ఉచిత బీమా పథకం పూర్తిస్థాయిలో అందునట్లుగా చరిత్రలో నిలిచిపోయేటట్లుగా ఈ పథకానికి విధి విధానాలను రూపకల్పన చేస్తూ దేశంలోనే చారిత్రాత్మక పథకంగా నిలిచిపోయేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత ఉచిత బీమా నూతన పథకం ఎంతో హర్షనీయం అని ఈ సందర్భంగ థోండి రమణ అన్నారు.