Peddapalli: ఓదెల మల్లన్న హుండీ ఆదాయం ఎంతో తెలుసా?
Peddapalli: పెద్దపల్లి జిల్లా ఓదెల మల్లికార్జున స్వామి దేవాలయంలో ఏడు నెలల హుండీ లెక్కింపు.
Peddapalli: ఓదెల మల్లన్న హుండీ ఆదాయం ఎంతో తెలుసా?
Peddapalli: జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో మంగళవారం హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. గత ఏడు నెలలకి గాను భక్తులు సమర్పించుకున్న కానుకలను అధికారులు పారదర్శకంగా లెక్కించారు.
పెద్దపల్లి జిల్లా దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, ఆలయ EO సదయ్య సమక్షంలో ఈ లెక్కింపు ప్రారంభమైంది. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగంలో హుండీలను తెరిచి, భక్తులు సమర్పించిన నగదు, బంగారం, వెండి వస్తువులను వేరు చేశారు.