తెలంగాణలో కొత్తగా 1,802 కరోనా కేసులు

Update: 2020-09-07 04:34 GMT

Coronavirus Updates in Telangana | తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. నిన్న రాత్రి 8 గంటల వరకు కొత్తగా 1,802 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. 09 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్క రోజే 2,711 మంది కరోనా నుండి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,42,771కి చేరింది. మృతుల సంఖ్య 895కి పెరిగింది. ఇప్పటి వరకూ డిశ్చార్జి అయిన సంఖ్య 1,10,241కి చేరింది. ప్రస్తుతం 31,635 మంది వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు.

దేశవ్యాప్తంగా కరోనా రోగుల రికవరీ రేటు 77.25 శాతంగా ఉండగా.. తెలంగాణలో 77.2 శాతంగా ఉందని వైద్యారోగ్య శాఖ తెలిపింది. ఇక దేశంలో కరోనా మరణాల రేటు 1.70 శాతంగా ఉండగా.. రాష్ట్రంలో 0.62 శాతంగా ఉందని వెల్లడించింది. గత 24 గంటల్లో 36,593 వైరస్‌ నిర్ధారణ పరీక్ష చేశామని, మొత్తం పరీక్షల సంఖ్య 17,66,982 కు చేరిందని వైద్యారోగ్య శాఖ పేర్కొంది.



Tags:    

Similar News