Coronavirus Effect : పట్నం పొమ్మంటే పల్లె ఆదుకుంది

Update: 2020-07-20 09:04 GMT

Coronavirus Effect :  ప్రపంచంలో ఏ మూలన చూసినా కరువుచాయలే. ఎవరిని కదలించినా మారిన బతుకు చిత్రాలే. ఆర్థిక కష్టాలు ఇప్పుడు అల్లాడిస్తున్నాయి. బతుకుదెరువు లేక బక్క చిక్కేలాచేస్తున్నాయి. ఒకప్పుడు పల్లె పోమ్మంటే పట్నం రారమ్మన్నది. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా తారుమారయ్యాయి. తానొకటి తలిస్తే.. దైవమొకటి తలిచిందన్నట్టుగా మారిపోయాయి. ఆదరిస్తుందనుకున్న పట్నం తానేమీ చేయలేనంటూ చేతులెత్తేస్తే పొమ్మన్న పల్లెనే ఇప్పుడు అక్కున చేర్చుకుంటుంది. నేనున్నానంటూ ఆదరిస్తోంది. అందుకే బీదా బిక్కు, పేద, ధనిక తేడా లేకుండా అందరిది ఒకటే బాట అందరిదీ ఒకటే మాట. ఆర్థిక కష్టాల్లో మునిగితేలడం కంటే ఉన్నదేదో సాగుచేసుకొని బతుకుదామన్న ఆలోచనే. కరోనా దెబ్బకు మహామహా నగరాలే అల్లాడిపోతుంటే తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాలు మాత్రం సుభిక్షంగా కళకళలాడుతున్నాయి. గ్రామాల్లో అడుగంటిన ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా మారిపోతుంటే ఎంతో మంది గ్రామీణ యువత ఇప్పుడు నాగలి పట్టి దుక్కి దున్నుతోంది. నిజంగా, ఎంతలో ఎంత తేడా? ఎక్కడొచ్చిందీ తేడా?

ఎక్కడి నుంచి వచ్చి పడిందో కానీ ఈపాడు కరోనా ఎందరి జీవితాలోనో తలకిందులు చేసింది. ఒక స్థాయి ఆర్థిక గమనాన్ని అనూహ్యంగా మలుపు తిప్పింది. కాలంతో పరుగులు పెట్టే ప్రజల ఆశలను ఒక్కసారి కూలదోసింది. పాతాళానికి పడేసింది. పల్లెల్లో ఉంటే చిన్నతనమని, ఉపాధి దొరకదని భావించిన ప్రజలు ఒకప్పుడు పట్నం బాట పడితే అదే పట్నం ఇప్పుడు తాను ఆదరించలేనంటూ చేతులెత్తస్తోంది. అందుకే యువత మళ్లీ తిరుగు పయనం అవుతోంది. పల్లెల్లో ఉపాధి కోసం పరుగులు తీస్తోంది.

-పూర్తి స్టోరీ కోసం వీడియో చూడండి..

Full View


Tags:    

Similar News