Corona Vaccine clinical trials in NIMS Hyderabad: కరోనా‌ వ్యాక్సిన్‌ తయారీలో మరో ముందడుగు

Corona Vaccine clinical trials in NIMS Hyderabad: ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా మహమ్మారిని అరికట్టేందుకు ప్రపంచ దేశాలన్ని వ్యాక్సిన్ ని కనిపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే.

Update: 2020-07-20 09:29 GMT
Corona Vaccine trials in NIMS Hyderabad:

Corona Vaccine clinical trials in NIMS Hyderabad: ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా మహమ్మారిని అరికట్టేందుకు ప్రపంచ దేశాలన్ని వ్యాక్సిన్ ని కనిపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తెలంగాణలోని భారత్ బయోటెక్ కూడా వ్యాక్సిన్ తయారి కోసం అడుగులు వేసింది. అయితే ఇప్పటికే వ్యాక్సిన్ ను కనిపెట్టిన ఈ సంస్థ మరో అడుగు ముందుకేసి క్లినికల్ ట్రయల్స్ ను కూడా మొదలు పెట్టింది. ఇందులో భాగంగానే హైదరాబాద్‌లోని నిమ్స్‌ కేంద్రంగా పనిచేస్తున్న వ్యాక్సిన్‌ తయారీ బృందం కీలక దశలోకి అడుగుపెట్టింది. క్లినికల్ ట్రయల్స్ లో భాగంగా సోమవారం వాలంటీర్‌కు తొలి డోస్‌ను ఇచ్చారు. ఇదే తరహాలో దేశ వ్యాప్తంగా మొత్తం 12 వైద్య కేంద్రాల్లో వ్సాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ జరుగుతున్నాయి.

ఇక పోతే ఐసీఎంఆర్‌ అనుమతితో మొదలు పెట్టిన క్లినికల్ ట్రయల్స్ ను ఫేస్ 1, ఫేస్ 2 కింద జరుగనున్నాయి. ఇక ఈ వ్యాక్సిన్ ని ఆగస్టు 15వ తేదీ నాటికి తయారు చేయాలని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌) భావిస్తోంది. కరోనా వైరస్ ని అంతం చేయడానికి ప్రపంచ దేశాలన్నీ వ్యాక్సిన్ ని కనిపెట్టే పనిలో పడ్డ విషయం తెలిసిందే. అదే విధంగా భారత దేశంలోని సైంటిస్టులు కూడా వైరస్ కు ఆంటి వ్యాక్సిన్ ని కనిపెట్టేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని ఫర్మాకంపెనీలు వ్యాక్సిన్ తయారిలో చురుకుగా పనిచేస్తున్నాయి.

ఈ క్రమంలోనే హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్(Bharat Biotech) సంస్థ కరోనాను అరికట్టేందుకు కొవాక్సిన్(Covaxin) పేరిట వ్యాక్సిన్ ని రూపొందించి. అంతే కాదు ఆ వ్యాక్సిన్‌‌ను ఆగష్టు 15 నాటికి ప్రజలకు అందుబాటులోకి తేనుందని ఐసీఎంఆర్ ప్రకటించింది. భారత్ బయోటెక్ సంస్థ కనుగొన్న ఈ వ్యాక్సిన్‌ క్లినికల్ ట్రయల్స్‌ కోసం ఐసీఎంఆర్ ఇప్పటికే దేశంలోని 12 ఆస్పత్రులను కూడా ఎంపిక చేసుకుంది. అందులో భాగంగానే ఆయా ఆస్పత్రులకు లేఖ కూడా రాసింది. ఐసీఎంఆర్, పుణేలోని వైరాలజీ ఇన్‌స్టిట్యూట్‌తో కలిసి భారత్ బయోటెక్ రూపొందించిన ఈ వ్యాక్సిన్‌ క్లినికల్ ట్రయల్స్‌ను త్వరితగతిన పూర్తి చేయాలని ఐసీఎంఆర్ హాస్పిటళ్లను కోరింది. 

Tags:    

Similar News