Nizamabad: వర్ని మండలం సిద్దాపూర్‌లో కరోనా కలకలం

Nizamabad: వివాహ వేడుకలో పాల్గొన్న 86 మందికి కరోనా నిర్ధారణ * హన్మజిపేట్‌లో ఓ వివాహ వేడుకలో పాల్గొన్న 86 మంది

Update: 2021-04-04 07:02 GMT

కరోన వైరస్ (ఫైల్ ఇమేజ్)

Nizamabad: నిజామాబాద్‌ జిల్లా వర్ని మండలం సిద్ధాపూర్‌లో కరోనా కలకలం రేగింది. హన్మజిపేట్‌లో ఓ వివాహ వేడుకలో పాల్గొన్న 86 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. పెళ్లి వేడుకలో పాల్గొన్న 370 మందికి టెస్టులు చేయగా.. అందులో 86 మందికి పాజిటివ్‌ రిపోర్ట్‌ వచ్చింది.

అదేవిధంగా నిజామాబాద్‌లోని షాపింగ్స్‌ మాల్స్‌ కూడా కరోనాకు హాట్‌ స్పాట్స్‌లుగా మారాయి. నగరంలోని ఓ షాపింగ్‌ మాల్‌లో కరోనా పంజా విసిరింది. షాపింగ్‌ మాల్‌లోని 75 మంది సిబ్బంది కరోనా బారిన పడ్డారు. అటు నిజామాబాద్‌లోని మరో వస్త్ర దుకాణంలో విధులు నిర్వహిస్తున్న 14 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. ఇక ఇంతమంది వైరస్‌ బారిన పడుతున్న వైద్య ఆరోగ్య శాఖ అధికారులు స్పందించడం లేదు. 

Full View


Tags:    

Similar News