Telangana Panchayat Elections: రేపు తెలంగాణలో చివరి విడత పంచాయతీ ఎన్నికలు

Telangana Panchayat Elections: రేపు తెలంగాణ వ్యాప్తంగా చివరి విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. నిన్నటితో ఎన్నికల ప్రచారం కూడా ముగిసింది.

Update: 2025-12-16 06:24 GMT

Telangana Panchayat Elections: రేపు తెలంగాణలో చివరి విడత పంచాయతీ ఎన్నికలు

Telangana Panchayat Elections: రేపు తెలంగాణ వ్యాప్తంగా చివరి విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. నిన్నటితో ఎన్నికల ప్రచారం కూడా ముగిసింది. ఇక చివరి విడతలో మొత్తం 182 మండలాల్లోని 4వేల 157 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా.. ఇప్పటికే 394 పంచాయతీ స్థానాలు ఏకగ్రీవమైనట్టు ఈసీ వెల్లడించింది. మరో 11 సర్పంచ్‌ స్థానాలకు నామినేషన్లు దాఖలు కాలేదు. దీంతో మిగిలిన 3వేల 752 సర్పంచ్‌ పదవులకు ఎన్నికలు జరగనున్నాయి.

సర్పంచ్‌ స్థానాల్లో 12వేల 640 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అలాగే మొత్తం 36వేల 434 వార్డులకు ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే 7వేల 916 స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. మరో 112 స్థానాలకు నామినేషన్లు దాఖలు కాలేదు. దీంతో మిగిలిన 28 వేల 406 వార్డులకు 75వేల 283 మంది బరిలో నిలిచారు.

ఇక రేపు జరగబోయే చివరి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 53 లక్షల 6వేల 401 మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో పురుషులు 26 లక్షల 18 వందల 61 మంది కాగా.. మహిళా ఓటర్లు 27 లక్షల 4 వేల 394 మంది ఉన్నారు. అలాగే 146 మంది ఇతర కేటగిరీ ఓటర్లు ఓటేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 36వేల 483 పోలింగ్‌ స్టేషన్లను సిద్ధం చేసింది ఎన్నికల సంఘం.

ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్‌ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్‌ ప్రక్రియ కొనసాగుతుంది. రేపు సాయంత్రంలోపు ఫలితాలను వెల్లడించనుంది ఈసీ. ఇప్పటికే రెండు విడతల్లో పంచాయతీ ఎన్నికలు పూర్తి చేసిన ఈసీ.. చివరి దశ పోలింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. పోలింగ్‌ స్టేషన్ల దగ్గర భద్రతను కట్టుదిట్టం చేయనున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా.. భారీగా పోలీసులను మోహరించనున్నారు.

Tags:    

Similar News