Kamareddy: దోమకొండలో పెద్దపులి సంచారం
Kamareddy: కామారెడ్డి జిల్లా దోమకొండలో పెద్దపులి సంచారం.. తీవ్ర కలకలం రేపుతోంది. అంబారీపేట్ గ్రామ శివారులో పశువులపై దాడి చేసింది పెద్దపులి.
Kamareddy: కామారెడ్డి జిల్లా దోమకొండలో పెద్దపులి సంచారం.. తీవ్ర కలకలం రేపుతోంది. అంబారీపేట్ గ్రామ శివారులో పశువులపై దాడి చేసింది పెద్దపులి. వరుసగా రెండ్రోజుల నుంచి ఈ ఘటనలు జరుగుతున్నాయి. ఇప్పటికే పెద్దపులి దాడిలో రెండు గేదెలు మృతి చెందాయి. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు.. పెద్దపులి ఆనవాళ్లు గుర్తించారు. అంబారీపేట్, లక్ష్మీదేవ్‌పల్లి, గొట్టిముక్కల గ్రామశివారుల్లో పెద్దపులి సంచరిస్తున్నట్టు గుర్తించారు.
పెద్దపులి ఆచూకీ కోసం ట్రాక్ కెమెరాలు ఏర్పాటు చేశారు. అయితే.. పెద్దపులి ఆనవాళ్లు కనిపించకపోవడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎటునుంచి వచ్చి తమపై దాడి చేస్తుందోనని ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. తక్షణమే పెద్దపులి సంచరిస్తున్న గ్రామాల్లో బోన్లు ఏర్పాటు చేయాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు.