డీ లిమిటేషన్ వివాదంపై ఇవాళ హైకోర్టులో విచారణ
డీ లిమిటెషన్ వివాదం పై హైకోర్టు ఇవాళ మరోసారి విచారణ జరుపనుంది. రాంనగర్ ను చిక్కడపల్లి నుండి బాగ్ లింగంపల్లి లో కలపడాన్ని సవాలు చేస్తూ పిటిషన్ దాఖలైంది.
డీ లిమిటెషన్ వివాదం పై హైకోర్టు ఇవాళ మరోసారి విచారణ జరుపనుంది. రాంనగర్ ను చిక్కడపల్లి నుండి బాగ్ లింగంపల్లి లో కలపడాన్ని సవాలు చేస్తూ పిటిషన్ దాఖలైంది. పిటిషనర్ పై హైకోర్ట్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏ ప్రాతిపదికన డీలిమిటేషన్ ను వ్యతిరేకిస్తున్నారని పిటిషనర్ ను హైకోర్టు ప్రశ్నించింది. అక్కడ 100 ఫీట్ రోడ్డుతో పాటు 30 ఫీట్ నాలా ఉండటం పై పిటిషనర్ అభ్యంతరం తెలిపారు. ఇంటి డోర్ నెంబర్లు మార్పుతోపాటు, టాక్స్ చెల్లింపు దగ్గర అంశాలు మారుతాయని తెలిపారు. పిటిషనర్ అభ్యంతరాలు సంతృప్తిగా లేవని హైకోర్టు పేర్కొంది. చిక్కడపల్లి డివిజన్ ను రాష్ట్రాల బౌండరీలతో పోల్చడం పై హైకోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణ సందర్భంగా పలు దేశాల బౌండరీలు నదులు కారణంగా విభజించారని హైకోర్టు. తెలిపింది.