Cold Wave: భద్రాచలంలో కొనసాగుతున్న చలి తీవ్రత
Cold Wave: కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో చలి తీవ్రత కొనసాగుతుంది. ఉష్ణోగ్రతలు తక్కువ స్థాయిలో నమోదు కావడంతో పిల్లలు, పెద్దలు చలిమంటలకు అతుక్కుపోతున్నారు.
Cold Wave: భద్రాచలంలో కొనసాగుతున్న చలి తీవ్రత
Cold Wave: కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో చలి తీవ్రత కొనసాగుతుంది. ఉష్ణోగ్రతలు తక్కువ స్థాయిలో నమోదు కావడంతో పిల్లలు, పెద్దలు చలిమంటలకు అతుక్కుపోతున్నారు. గత 2 రోజులుగా భద్రాచలంలో తీవ్రస్థాయిలో మంచు పడుతుండడంతో... వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. రామాలయం పరిసర ప్రాంతాల్లో మంచు తీవ్రంగా కురుస్తుండడంతో... రామాలయ ప్రాంగణాలు కనిపించని పరిస్థితి నెలకొంది. భద్రాచలం పట్టణం నాలుగు వైపులా మంచు కురుస్తూ కొంత ఆహ్లాదకరంగా ఉన్నా... పిల్లలు, వృద్ధులు చలి కారణంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.