KTR: సర్పంచ్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి ప్రచారం చేయటం చరిత్రలో ఇదే తొలిసారి
KTR: సర్పంచ్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి ప్రచారం చేయటం దేశంలో ఇదే తొలిసారి అని కేటీఆర్ విమర్శించారు.
KTR: సర్పంచ్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి ప్రచారం చేయటం చరిత్రలో ఇదే తొలిసారి
KTR: సర్పంచ్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి ప్రచారం చేయటం దేశంలో ఇదే తొలిసారి అని కేటీఆర్ విమర్శించారు. విజయోత్సవాల పేరుతో పరోక్షంగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రచారాలు చేపట్టారన్నారు. కొత్తగా ఎన్నికైనా బీఆర్ఎస్ సర్పంచులతో సిరిసిల్లలో కేటీఆర్ సమావేశం అయ్యారు. సర్పంచ్‌లుగా గెలిచిన వారిని కేటీఆర్ సత్కరించారు. రెండు విడతల్లో 83 సర్పంచ్ స్థానాలను బీఆర్ఎస్ గెలుచుకుందన్నారు. బీఆర్ఎస్ పాలనలో అన్ని సర్పంచ్ స్థానాల్లో గులాబీ జెండా ఎగిరిందని... రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో 83 గ్రామాల్లో బీఆర్ఎస్ జెండా ఎగిరిందంటే.. కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో తెలుస్తుందన్నారు. మూడో విడత ఫలితాల్లో బీఆర్ఎస్ దూసుకెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.