KTR: కాంగ్రెస్ గూండాల అరాచకాలను ఉపేక్షించం

KTR: కాంగ్రెస్ గూండాల అరాచకాలను ఉపేక్షించమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.

Update: 2025-12-16 06:56 GMT

KTR: కాంగ్రెస్ గూండాల అరాచకాలను ఉపేక్షించమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. దాడికి ప్రతిదాడి తప్పదని వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు అత్యంత దారుణంగా, అమానవీయంగా ఉందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులపై చర్యలు తీసుకోకపోతే తాము కూడా తిరగబడాల్సి వస్తుందని కేటీఆర్ స్పష్టం చేశారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని సోమార్‌పేట్ గ్రామంలో కాంగ్రెస్ నాయకుల దాడిలో తీవ్రంగా గాయపడి, సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ నాయకులు బిట్ల బాలరాజు, ఆయన భార్య గంజి భారతిలను కేటీఆర్ పరామర్శించారు.

Tags:    

Similar News