తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న కరోనా కేసులు.. పండగల వేళ మరింత ఉద్ధృతంగా...

TS and AP Corona Cases: *జనాభాలో 30శాతం మందికి కొవిడ్‌! *ఫిబ్రవరి 15 నాటికి కేసులు పతాక స్థాయికి

Update: 2022-01-12 03:54 GMT

తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న కరోనా కేసులు.. పండగల వేళ మరింత ఉద్ధృతంగా...

TS and AP Corona Cases: తెలుగు రాష్ట్రాల్లో కరోనా ఉధృతి మొదలైంది. రోజురోజుకూ కొత్త కేసులు పెరుగుతున్నాయి. ఇప్పుడిప్పుడే ఒమిక్రాన్ వ్యాప్తి కనిపిస్తోంది. తెలంగాణలో సుమారు 30 శాతం జనాభాకు వైరస్ సోకే అవకాశాలున్నాయని వైద్యారోగ్య శాఖ అంచనా వేస్తోంది. డెల్టాతో పోల్చితే 70 రెట్లు వైరస్‌ లోడ్‌ ఎక్కువే అయునప్పటికీ.. ఒమిక్రాన్‌ వేరియంట్‌ గొంతులోనే ఉంటోందని.. ఊపిరితిత్తుల్లోకి వెళ్లడం లేదని వైద్య నిపుణులంటున్నారు.

అందుకే కేసుల్లో 90శాతం మందికి పైగా ఆస్పత్రుల్లో చేరడం లేదని చెప్తున్నారు. వచ్చేనెల 15 నాటికి రాష్ట్రంలో థర్డ్‌వేవ్‌ పతాక స్థాయికి చేరుతుందని వైద్య శాఖ అంచనా వేస్తోంది. ఆ తర్వాత కేసులు తగ్గుముఖం పడతాయని భావిస్తోంది.మరోవైపు తెలంగాణలో పెద్ద సంఖ్యలో వైద్యులు కరనా బారిన పడుతున్నారు. గాంధీ, ఉస్మానియా హాస్పిటల్స్‌లో 84 మంది డాక్టర్లకు వైరస్ సోకింది. నిలోఫర్‌లో ఒక డాక్టర్‌కు పాజిటివ్ వచ్చింది.

ప్రైవేట్ హాస్పిటళ్లలో కూడా భారీ సంఖ్యలో వైద్యులు, మెడికల్ సిబ్బంది వైరస్ బారిన పడుతున్నారు. గాంధీ, ఉస్మానియాకు చెందిన అనేక మంది డాక్టర్లు మంగళవారం కూడా ఆర్‌‌‌‌టీపీసీఆర్ టెస్టులు చేయించుకున్నారు. వీళ్లలోనూ పెద్ద సంఖ్యలోనే పాజిటివ్ కేసులు ఉండొచ్చని సమాచారం. ఇక ఏపీలోనూ వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది.

ఇటీవల విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన కొవిడ్‌ బాధితులతో పాటు ర్యాండమ్‌గా స్థానికుల నుంచి సేకరించి పంపిన సుమారు వంద నమూనాలను హైదరాబాద్‌లోని సీసీఎంబీలో పరీక్షించగా 80శాతం వరకు ఒమిక్రాన్‌ వేరియంట్‌కు చెందినవిగా తేలినట్లు తెలుస్తోంది. మరోవైపు దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. యాక్టివ్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. మొత్తంగా 9 లక్షలకు యాక్టివ్ కేసులు చేరాయి. రోజువారీ సగటు పాజిటివిటీ రేటు 10 శాతం దాటుతుందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Tags:    

Similar News