Revanth Reddy: డీజీపీకి రేవంత్ రెడ్డి లేఖ.. తక్షణమే 6+6 భద్రత కల్పించాలి
Revanth Reddy: జులై లో 2+2 భద్రతను సైతం వెనుక్కు తీసుకున్నారు
Revanth Reddy:డీజీపీకి రేవంత్ రెడ్డి లేఖ.. తక్షణమే 6+6 భద్రత కల్పించాలి
Revanth Reddy: భద్రతపై తెలంగాణ డీజీపీకి కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి లేఖ రాశారు. న్యాయస్థానం ఆదేశాల ప్రకారం తనకు భద్రతను పెంచాలని కోరుతూ ఆయన లేఖలో కోరారు. గతంలో యాత్ర సందర్భంగా సెక్యూరిటీ కల్పించాలని హైకోర్టును ఆశ్రయించినా సెక్యూరిటీ కల్పించడం లేదన్నారు రేవంత్. హైకోర్టులో మాత్రం 69 మంది సిబ్బందితో సెక్యూరిటీ కల్పిస్తున్నామని పోలీసులు తప్పుడు వాదనలు చేశారన్నారు దీనికి తోడుగా గత జూలై లో తనకు ఉన్న 2+2 భద్రతను సైతం వెన్నక్కు తీసుకున్నారని ఆరోపించారు. తనకు హైకోర్టు ఆదేశాల ప్రకారం తక్షణమే 6+6 భద్రత కల్పించాలని డిజిపిని కోరారు.