MLC Elections: స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు ఝలక్‌.. వ్యూహత్మాకంగా..

MLC Elections: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో పరుపు నిలుపుకుంది.

Update: 2021-12-14 12:31 GMT

MLC Elections: స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు ఝలక్‌.. వ్యూహత్మాకంగా..

MLC Elections: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో పరుపు నిలుపుకుంది. నిలబెట్టిన రెండు స్థానాల్లో పార్టీ ఓట్ల సంఖ్య కంటే ఎక్కువ ఓట్లు సాధించి టీఆర్‌ఎస్‌కు షాకిచ్చింది. మొదట్లో పోటీనే వద్దనుకున్న హస్తం పార్టీ చివరి నిమిషంలో అభ్యర్థులను రంగంలో దించి ఊహించిన దాని కంటే ఎక్కువ ఓట్లు సాధించుకుంది. ఈ ఫలితాలు కాంగ్రెస్‌ నాయకుల్లో ఉత్సాహం నింపుతున్నాయి.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరువు దక్కించుకుంది. ప్రత్యర్థి పార్టీ టీఆర్ఎస్‌కు ఝలక్‌ ఇచ్చింది. గెలిచే అవకాశాలు లేకున్నా మెదక్, ఖమ్మం స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. సీఎం సొంత జిల్లాల్లో టీఆర్‌ఎస్‌కు షాక్‌ ఇవ్వాలని కాంగ్రెస్ భావించింది. సొంత పార్టీ ఓట్లను కాపాడుకోవడం కూడా కష్టమని అనుకున్న తరుణంలో అనూహ్యంగా ఎక్కువ ఓట్లను రాబట్టుకుంది. మెదక్ జిల్లాల్లో కాంగ్రెస్ ఓట్లు 230 కాగా కాంగ్రెస్ అభ్యర్థి నిర్మాల జగ్గారెడ్డికి 238 ఓట్లు వచ్చాయి. ఆ 8 ఓట్లు టీఆర్‌ఎస్‌లోని అసంతృప్తుల ఓట్లే అని కాంగ్రెస్‌ నేతలు బలంగా భావిస్తున్నారు.

ఇక ఖమ్మం జిల్లాలో సైతం కాంగ్రెస్ అంచనాకు మించి ఓట్లు వచ్చాయి. భారీగా కాంగ్రెస్ అభ్యర్థికి టీఆర్ఎస్ నుంచి క్రాస్ ఓట్లు పడ్డాయి. కాంగ్రెస్ పార్టీ చివరి నిమిషంలో అభ్యర్థులను ఆచితూచి ప్రకటించినా టార్గెట్‌ను రీచ్‌ అయ్యింది. ఖమ్మం ఎమ్మెల్సీ స్థానంలో కాంగ్రెస్ ఓట్లు 116 కాగా 20 మంది టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. అంటే కాంగ్రెస్‌ వద్ద 96 ఓట్లు మాత్రమే ఉండాలి. కానీ ఈ ఎన్నికల్లో హస్తం పార్టీకి 247 ఓట్లు పడ్డాయి. అంటే 151 ఓట్లు క్రాస్ ఓటింగ్ జరిగిందని కాంగ్రెస్ భావిస్తోంది. ఖమ్మం టీఆర్‌ఎస్‌లోని అసంతృప్తులు అంతా కాంగ్రెస్ అభ్యర్థి నాగేశ్వర్ రావు కు క్రాస్ ఓటింగ్ వేశారని హస్తం పార్టీ నేతలు లెక్కలు వేస్తున్నారు.

ఖ‌మ్మం, మెదక్‌ స్థానాల్లో కాంగ్రెస్‌ గెలువకపోయినా టీఆర్ఎస్‌లోని అసమ్మతి రాగాలు ఫలితాల రూపంలో బయటపడ్డాయి. ఈ ఫలితాలు టీఆర్‌ఎస్‌లో వివాదాలు మరింత ముదురే అవకాశం లేకపోలేదు. మొత్తానికి కాంగ్రెస్‌ వ్యూహత్మాకంగా అధికార టీఆర్‌ఎస్‌ పార్టీని ఇరుకున పడేసింది. ఈ ఫలితాలతో టీఆర్‌ఎస్‌ పార్టీకి గెలిచిన తృప్తి లేకుండా పోయింది. 

Full View


Tags:    

Similar News