KTR: 75ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో.. దేశాన్ని దోచుకున్న తోడు దొంగలు కాంగ్రెస్‌.. బీజేపీ

KTR: AICC అంటే అఖిల భారత కరప్షన్ కమిటీ

Update: 2023-08-13 04:46 GMT

KTR: 75ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో.. దేశాన్ని దోచుకున్న తోడు దొంగలు కాంగ్రెస్‌.. బీజేపీ

KTR: కాంగ్రెస్, బీజేపీ టార్గెట్‌గా ఫైరయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీఆర్ఎస్‌ను నేరుగా ఢీకొనే దమ్ము బీజేపీ, కాంగ్రెస్‌కు లేదని కేటీఆర్‌ మండిపడ్డారు. MIM భుజంపై తుపాకీ పెట్టి BRSను కాల్చేందుకు BJP కుట్ర చేస్తోందన్న కేటీఆర్‌.. మరో వైపు BJP భుజంపై తుపాకీ పెట్టి తమ పార్టీని కాల్చేందుకు కాంగ్రెస్‌ కుతంత్రం చేస్తోందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ పార్టీ వెన్నుపోటు వారసుడిని నమ్ముకుని వెన్నుముక లేని పార్టీగా మిగిలిపోయిందని విమర్శించారు.

75 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో.. దేశాన్ని దోచుకున్న తోడు దొంగలు కాంగ్రెస్‌, బీజేపీ అని విరుచుకుపడ్డారు కేటీఆర్. ఏఐసీసీ అంటే అఖిల భారత కరప్షన్‌ కమిటీ అని, అలాగే BJP అంటే భ్రష్టాచార్‌ జనతా పార్టీ అని విమర్శించారు. BRS అంటే భారత రైతు సమితి అని కేటీఆర్‌ అన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు అంటే అసమర్థ పాలనకు కేరాఫ్‌ అని, అవినీతి ప్రభుత్వాలకు చిరునామా అని ఆరోపించారు. ఆ రెండు పార్టీల దశాబ్దాల పాలనా వైఫల్యాల పాపమే.. దేశానికి, రాష్ట్రానికి శాపమై వెంటాడుతున్నాయని ట్విట్టర్ వేదికగా నిప్పులు చెరిగారు కేటీఆర్. 

Tags:    

Similar News