Revanth Reddy: 48 గంటల్లో జైలు అన్నావుగా కిషన్ రెడ్డి.. మరి ఏమైంది?
Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణను ఢిల్లీలో తొక్కిపెట్టారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు.
Revanth Reddy: 48 గంటల్లో జైలు అన్నావుగా కిషన్ రెడ్డి.. మరి ఏమైంది?
Revanth Reddy: కాళేశ్వరంలో కేసీఆర్ కుటుంబం దోపిడీకి పాల్పడిందని ప్రధాని అన్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగిస్తే కేసీఆర్, హరీష్ రావును 48 గంటల్లో జైల్లో పెడతామన్నారు.
వీళ్ళ మాటలు నమ్మి మేం కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగించామని తెలిపారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణను ఢిల్లీలో తొక్కిపెట్టి మీరు వాళ్లు ఒక్కటై పార్లమెంటు ఎన్నికల్లో ఓట్లు సీట్లు పంచుకున్నారని ఆరోపించారు. కాళేశ్వరం కేసులో కెసీఆర్, హరీష్ ను జైల్లో పెట్టిన తరువాత బీజేపీ నేతలు సూచనలు చేస్తే బాగుంటుందని బీజేపీ నేతలపై మండిపడ్డారు.