Kondagattu: ఒకటి కాదు.. రెండు కొండగట్టులో పౌర్ణమి గిరిప్రదక్షిణ తేదీ ఇదే!
Kondagattu: కొండగట్టు గిరిప్రదక్షిణ షెడ్యూల్ మార్పు! జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు అంజన్న ఆలయంలో పౌర్ణమి గిరిప్రదక్షిణను 1వ తేదీ నుంచి 2వ తేదీకి వాయిదా వేశారు.
Kondagattu: ఒకటి కాదు.. రెండు: కొండగట్టులో పౌర్ణమి గిరిప్రదక్షిణ తేదీ ఇదే!
Kondagattu: ప్రతి పౌర్ణమి సందర్భంగా భక్తి వైభవంగా నిర్వహించే కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం గిరిప్రదక్షిణ కార్యక్రమంలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని ఈ పవిత్ర క్షేత్రంలో చిలుకూరి బాలాజీ ఆలయ పూజారి శ్రీరామదాసు సురేష్ ఆత్మరామ్ మహారాజు ఆధ్వర్యంలో జరిగే గిరిప్రదక్షిణ తొలుత ఒకటవ తేదీన నిర్వహించాలనుకున్నప్పటికీ, అనివార్య కారణాలతో రెండవ తేదీకి మార్చినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ మార్పును భక్తులు గమనించి, నిర్ణయించిన కొత్త తేదీ ప్రకారం గిరిప్రదక్షిణలో పాల్గొనాలని సూచిస్తున్నారు. ప్రతి నెలా పౌర్ణమి సందర్భంగా వేలాది మంది భక్తులు పాల్గొనే ఈ కార్యక్రమం ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాధాన్యత కలిగి ఉండగా, ఈసారి కూడా భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉందని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.