Karimnagar: చొప్పదండి రైతుల కోసం కీలక నిర్ణయాలు.. బడ్జెట్ ఆమోదం!

Karimnagar: కరీంనగర్ జిల్లా చొప్పదండి వ్యవసాయ సహకార సంఘం 75వ సర్వసభ్య సమావేశం వివరాలు. 2026-27 బడ్జెట్ ఆమోదం మరియు రుణాల చెల్లింపుపై కీలక హెచ్చరికలు.

Update: 2026-03-29 06:52 GMT

Karimnagar: చొప్పదండి రైతుల కోసం కీలక నిర్ణయాలు.. బడ్జెట్ ఆమోదం!

కరీంనగర్ జిల్లా: చొప్పదండి వ్యవసాయ సహకార సంఘం 75వ సర్వసభ్య సమావేశం ఘనంగా నిర్వహించారు. సంఘం పర్సన్ ఇంచార్జి కె. జమునరాణి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సభ్యుల ఆర్థిక బాధ్యతలపై కీలక సూచనలు చేశారు. తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించాలని, లేనిపక్షంలో సహకార చట్టం ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. సీఈఓ కళ్లెం తిరుపతి రెడ్డి వార్షిక నివేదికను సభ ముందుంచి వివరించారు. ఈ సందర్భంగా సంఘానికి సేవలందించిన మాజీ చైర్మన్ వెల్మ మల్లారెడ్డి, మాజీ వైస్ చైర్మన్ ముద్దం మహేష్‌తో పాటు డైరెక్టర్లను ఘనంగా సన్మానించారు. సమావేశం ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగింది.

Tags:    

Similar News